Indian Students in UK: లండన్‌లో భారతీయురాలికి 4,50,000 పౌండ్ల పరిహారం.! జాతి వివక్ష కేసులో తీర్పు.

|

Feb 16, 2024 | 4:51 PM

లండన్‌లోని ఓ యూనివర్సిటీ... భారతీయురాలి పట్ల జాతి వివక్ష చూపింది. దీంతో బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఎంప్లాయిమెంట్‌ ట్రైబ్యునల్.. యూనివర్సిటీని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. భారత్‌కు చెందిన కాజల్‌ శర్మ పోర్ట్‌మౌత్‌ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. ఆమె ఐదేళ్ల కాంట్రాక్టు ఒప్పందం 2020 డిసెంబరులో ముగిసింది. తన అనుభవంతో మళ్లీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.

లండన్‌లోని ఓ యూనివర్సిటీ… భారతీయురాలి పట్ల జాతి వివక్ష చూపింది. దీంతో బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఎంప్లాయిమెంట్‌ ట్రైబ్యునల్.. యూనివర్సిటీని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. భారత్‌కు చెందిన కాజల్‌ శర్మ పోర్ట్‌మౌత్‌ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. ఆమె ఐదేళ్ల కాంట్రాక్టు ఒప్పందం 2020 డిసెంబరులో ముగిసింది. తన అనుభవంతో మళ్లీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. యూనివర్సిటీ లైన్‌ మేనేజర్‌ ప్రొఫెసర్‌ గారీ రీస్ ఆమె పట్ల జాతి వివక్ష చూపించాడు. నియామక ప్రక్రియలో ఎలాంటి కారణం చూపకుండా కాజల్‌ దరఖాస్తును తిరస్కరించాడు. అంతేకాకుండా అనుభవం లేని వారిని ఆ ఉద్యోగంలో భర్తీ చేశాడు. దీనిపై కాజల్‌ శర్మను ప్రశ్నించినా.. స్పందించలేదు. ఆమె ఫిర్యాదుతో సౌతాంప్టన్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. కాజల్‌ నైపుణ్యాలు, ఉద్యోగ అనుభవాన్ని గుర్తించడంలో రీస్‌ విఫలమయ్యాడని తెలిపింది. అతడు ఈ నియామక ప్రక్రియ పట్ల పారదర్శకంగా లేడని.. ఆమె దరఖాస్తును తిరస్కరించడానికి గల సరైన కారణాలను చూపించలేకపోయాడని గుర్తించింది. దీంతో బాధితురాలికి 4,50,000 పౌండ్లు చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..