Hamas: గాజాలో ఆస్పత్రి కిందే హమాస్ టన్నెల్..! కిడ్నాప్ చేసిన వారిని ఆ సొరంగంలోనే..
గాజాలో పదాతి దళాలతో యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్ సేనలు.. హమాస్‌కు చెందిన ఓ సొరంగాన్ని గుర్తించాయి. హమాస్ కమాండర్ ఇంటికి సమీపంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హంగరీ వీడియోలో చెప్పారు. సోలార్ ప్యానెళ్లతో ఆ టన్నెల్‌కు విద్యుత్ అందుతున్నట్లు ఐడీఎఫ్ గుర్తించింది. భూ ఉపరితలానికి 20 మీటర్ల లోపల ఉన్న ఆ సొరంగానికి బుల్లెట్ ప్రూఫ్ డోర్ ఉంది.
గాజాలో పదాతి దళాలతో యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్ సేనలు.. హమాస్‌కు చెందిన ఓ సొరంగాన్ని గుర్తించాయి. హమాస్ కమాండర్ ఇంటికి సమీపంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హంగరీ వీడియోలో చెప్పారు. సోలార్ ప్యానెళ్లతో ఆ టన్నెల్‌కు విద్యుత్ అందుతున్నట్లు ఐడీఎఫ్ గుర్తించింది. భూ ఉపరితలానికి 20 మీటర్ల లోపల ఉన్న ఆ సొరంగానికి బుల్లెట్ ప్రూఫ్ డోర్ ఉంది. సొరంగం లోపలికి డేనియల్ నడుచుకుంటూ వెళ్లగా.. టన్నెల్‌కు మరో చివరన అల్-రాంటిస్ ఆస్పత్రి బేస్‌మెంట్ ఉన్నట్లు గుర్తించారు. యుద్ధానికి ముందు ఈ ఆస్పత్రిలో చిన్నారులు, క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేవారని డేనియల్ తెలిపారు. ఆ బేస్‌మెంట్ వద్ద హమాస్ కమాండ్ సెంటర్ ఉంది. అందులో రాకెట్ ప్రొపెల్ల్‌డ్ గ్రనేడ్లు, రైఫిళ్లు, ఆత్మాహుతి దాడులకు ఉపయోగించే బాడీ వెస్ట్‌లు, ఇతర పేలుడు పదార్థాలను ఆయన గుర్తించారు. ఆస్పత్రులను హమాస్ తమ దారుణాలకు వినియోగించుకుంటోందనీ… ఇదీ హమాస్ అంటే..! అని.. ఇజ్రాయెల్ ఎవరితో పోరాడుతోందో ఇకనైనా ఈ ప్రపంచం అర్థం చేసుకోవాలని డేనియల్ ఆ వీడియోలో అన్నారు. ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసిన పౌరులను హమాస్ ఈ టన్నెల్‌లోనే బందీలుగా దాచి ఉంచినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి సొరంగంలో తాము కొన్ని ఆధారాలను గుర్తించినట్లు డేనియల్ వెల్లడించారు. ఈ టన్నెల్‌లో ఓ బైక్ ఉంది దానికి బుల్లెట్ తగిలిన గుర్తులున్నాయి. బహుశా అక్టోబరు 7 నాటి దాడిలో దాన్ని ఉపయోగించి ఉండొచ్చు. ఇక, ఇక్కడ మహిళల దుస్తులు, కుర్చీలకు కట్టిన తాళ్లు కన్పించాయి. డైపర్లు, చిన్నారుల ఫీడింగ్ బాటిళ్లు కూడా ఉన్నాయి. వీటిని చూస్తుంటే బందీలను కొంతకాలం ఇక్కడ ఉంచినట్లు తెలుస్తోందని అన్నారు. అంతేకాదు.. ఇక్కడ ఓ క్యాలెండర్ ఉంది. అందులో అక్టోబరు 7 నుంచి తేదీలను మార్క్ చేసి ఉంచారు అని డేనియల్ ఆ వీడియోలో తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.