Israel-Hamas: అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు

|

Apr 27, 2024 | 12:34 PM

హమాస్‌-ఇ్రజాయెల్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ హమాస్‌ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే.. ఇజ్రాయెల్‌తో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువకాలం సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా ఆయుధాలు వీడి.. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌’లో చేరాలనుకుంటున్నట్లు ఓ వార్తాసంస్థతో తెలిపారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం మొదలై దాదాపు ఏడు నెలలవుతోంది. ఇప్పటికీ అనేకమంది బందీలు ఉగ్ర చెరలోనే ఉన్నారు. మరోవైపు టెల్‌అవీవ్‌ భీకర దాడులు.. గాజాను మరుభూమిగా మారుస్తున్నాయి. ఇప్పటికే 34 వేల మందికి పైగా మృతి చెందారు. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారాయి. ఈ పరిణామాల నడుమ హమాస్‌ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్‌ అల్‌-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే.. ఇజ్రాయెల్‌తో సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఆయుధాలు వీడి.. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌’లో చేరతామని తెలిపారు.

హమాస్‌ అంతమే లక్ష్యంగా యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్‌.. హమాస్‌ను నిర్మూలించడంలో విఫలమైంది. ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే దెబ్బతీయగలిగింది. యుద్ధం ముగుస్తుందని తమకు హామీ ఇవ్వకపోతే.. బందీలను ఎందుకు విడుదల చేస్తాం? ఒకవేళ హమాస్‌ను అంతం చేయకపోతే పరిష్కారం ఏంటి? అందుకే, ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వెళ్లడమే ఉత్తమం.. అంటూ అల్‌-హయ్యా వ్యాఖ్యానించారు. గాజాలో వినాశనానికి దారితీసినప్పటికీ.. అక్టోబరు 7 నాటి దాడుల విషయంలో పశ్చాత్తాపం లేదని చెప్పారు. పాలస్తీనా సమస్యను మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో తాము విజయం సాధించామన్నారు. శాశ్వత కాల్పుల విరమణ, ఇజ్రాయెల్‌ బలగాల పూర్తిస్థాయి ఉపసంహరణ డిమాండ్ల నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు ద్విదేశ పరిష్కారానికి (Two State Solution) ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నిరాకరిస్తున్నారు. హమాస్‌ను అంతం చేసేవరకు పోరాటం సాగిస్తామని పలుమార్లు స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.