US Citizenship: గుడ్‌న్యూస్‌.. లక్షలమంది వలసదారులకు అమెరికా పౌరసత్వం.

|

Jun 21, 2024 | 10:43 AM

మరికొన్ని నెలల్లో దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వలసదారులను ఆకట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో చట్టపరమైన హోదా లేని యూఎస్ పౌరుల జీవిత భాగస్వాములు - శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరికొద్ది నెలల్లో బైడెన్ ప్రభుత్వం అనుమతిస్తుందని వైట్ హౌస్ మంగళవారం ప్రకటించింది.

మరికొన్ని నెలల్లో దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వలసదారులను ఆకట్టుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో చట్టపరమైన హోదా లేని యూఎస్ పౌరుల జీవిత భాగస్వాములు – శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరికొద్ది నెలల్లో బైడెన్ ప్రభుత్వం అనుమతిస్తుందని వైట్ హౌస్ మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 5 లక్షల మంది వలసదారులకు ఊరట కలగనుందని వైట్‌ హౌస్‌ సీనియర్ పాలనాధికారి తెలిపారు. అమెరికా పౌరులను పెళ్లి చేసుకుని కూడా చట్టబద్ధ హోదా లేకుండా అమెరికాలో నివసించాల్సి వస్తున్న వారికి శాశ్వత నివాస హక్కు, అమెరికా పౌరసత్వం అందించాలని నిర్ణయించారు. అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని వివాహం చేసుకున్నవారికి పుట్టిన పిల్లల్లో 50,000 మందికి కూడా ఇదే వసతి లభిస్తుంది.

వైట్‌హౌస్‌ మంగళవారం చేసిన ప్రకటనతో దాదాపు 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిన పురుషులు లేదా మహిళలు అమెరికా పౌరులను పెళ్లాడిన తరవాత జూన్‌ 17 నాటికి పదేళ్లుగా అమెరికాలో నివసించి ఉండాలి. సోమవారం దాటిన తరవాత పదేళ్లు నిండేవారికి ఈ సౌకర్యం లభించదు. అర్హులైనవారి దరఖాస్తు ఆమోదం పొందిన మూడేళ్లలో గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి తాత్కాలిక పని పర్మిట్‌ లభిస్తుంది. ఈ మూడేళ్లలో వారిని స్వదేశాలకు తిప్పిపంపరు. అమెరికా పౌరులను వివాహం చేసుకున్నా ఆ దేశ పౌరసత్వం లభించనివారు 11 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వీరిలో అర్హులైనవారికి పౌరసత్వం లభించనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.