గాజాలో పస్తులు.. పశువుల దాణాయే ఆహారం

|

Feb 16, 2024 | 1:40 PM

ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఆహార కొరతతో పాలస్తీనా పౌరులు అల్లాడుతున్నారు. ఆకలి నుంచి తప్పించుకోవడానికి గతంలో పశువులకు పెట్టిన దాణానే తాము ఆహారంగా స్వీకరించాల్సిన దుస్థితి గాజా వాసులకు తలెత్తింది. ఒకవైపు ఆహార కొరత, మరోవైపు ఆకాశాన్నంటిన ధరల కారణంగా గాజా వాసులకు పిండి దొరకడమే గగనంగా మారింది. గాజా వాసుల్లో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు.

ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఆహార కొరతతో పాలస్తీనా పౌరులు అల్లాడుతున్నారు. ఆకలి నుంచి తప్పించుకోవడానికి గతంలో పశువులకు పెట్టిన దాణానే తాము ఆహారంగా స్వీకరించాల్సిన దుస్థితి గాజా వాసులకు తలెత్తింది. ఒకవైపు ఆహార కొరత, మరోవైపు ఆకాశాన్నంటిన ధరల కారణంగా గాజా వాసులకు పిండి దొరకడమే గగనంగా మారింది. గాజా వాసుల్లో అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. చాలా మందికి రోజుల తరబడి ఆహారం దొరకడం లేదు. గోధుమలను పిండిగా ఆడించడానికి మిల్లులకు చాలా తక్కువ మంది వస్తున్నారని మిల్లు యజమానులు వాపోతున్నారు. చాలా మంది గతంలో పశువులకు ఆహారంగా పెట్టే వాటినే తీసుకొస్తున్నారని తెలిపారు. వాటినే వారు ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు. కొన్నిసార్లు ఇసుకతో కూడిన ఆహారాన్నే తినాల్సి వస్తోందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాలంటైన్స్‌ డే ఎఫెక్ట్.. నిమిషానికి 350 గులాబీలు..406 చాక్లెట్లు ఆర్డర్‌

అరుదైన సంఘటన.. బిడ్డకు జన్మనిచ్చిన ఆరు నెలల్లోనే మళ్లీ ప్రసవించిన మహిళ !!

దొంగలకూ వేలల్లో జీతాలు.. ఎక్కడో తెలుసా ??

ఆపు నీ సొల్లు.. ఇంతోటి దానికి విడాకులు ఎందుకో ??

ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన స్టార్ డైరెక్టర్

Published on: Feb 16, 2024 01:40 PM