Fire Accident: పగిలిన పైప్ లైన్.. ఎగసిపడుతున్న మంటలు.! విజువల్స్..
అమెరికాలోని హ్యూస్టన్ లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. లా పోర్టె సిటీలో పైప్ లైన్ పగిలి మంటలు చెలరేగాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9:55 గంటల ప్రాంతంలో మంటలు మొదలయ్యాయి. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత మంటలు కనిపించాయని స్థానికులు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన అధికారులు అక్కడికి చేరుకున్నారు.
అమెరికాలోని హ్యూస్టన్ లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. లా పోర్టె సిటీలో పైప్ లైన్ పగిలి మంటలు చెలరేగాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9:55 గంటల ప్రాంతంలో మంటలు మొదలయ్యాయి. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత మంటలు కనిపించాయని స్థానికులు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మంటలు వ్యాపించడంతో పలు విద్యుత్ స్తంభాలు కాలిపోయాయని, చుట్టుపక్కల పలు నివాసాలకు మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు పెద్ద ఎత్తున ఉపయోగించారు. హెలికాఫ్టర్ తో మంటల తీవ్రతను పరిశీలిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఆకాశంలోకి ఎగిసిపడుతున్న మంటలు చాలా దూరం వరకూ కనిపిస్తున్నాయని లా పోర్టే వాసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.