6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సమయంలో ప్రయాణికుల సంఖ్య పడిపోయి విమానయానరంగం నష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంది. దేశీయ విమానయానరంగంలో తాజాగా ఆదివారం ఏప్రిల్ 21న సరికొత్త రికార్డు నమోదైంది. ఆ రోజు ఏకంగా 4,71,751 మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. ఒక రోజులో ఇంతమంది విమానాల్లో ప్రయాణించడం ఇదే తొలిసారని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది.
దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా సమయంలో ప్రయాణికుల సంఖ్య పడిపోయి విమానయానరంగం నష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకుంది. దేశీయ విమానయానరంగంలో తాజాగా ఆదివారం ఏప్రిల్ 21న సరికొత్త రికార్డు నమోదైంది. ఆ రోజు ఏకంగా 4,71,751 మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. ఒక రోజులో ఇంతమంది విమానాల్లో ప్రయాణించడం ఇదే తొలిసారని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. వీరిని 6,128 విమానాల్లో వివిధ గమ్యస్థానాలకు చేర్చినట్టు పేర్కొంది. కరోనాకు ముందు ఒక రోజు ప్రయాణికుల సగటు 3,98,579 కాగా, ఇప్పుడు అందుకు 14 శాతం మంది అధికంగా ప్రయాణించారు. గత ఏడాది ఏప్రిల్ 21న 5,899 విమానాల్లో 4,28,389 మంది ప్రయాణించారు. ఇప్పుడు అంతకుమించి ప్రయాణించారు. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో విమాన ప్రయాణికుల సంఖ్య గతేడాది ఇదే కాలంలో పోల్చితే 375.04 లక్షల నుంచి 391.46 లక్షలకు పెరిగినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ప్రభాస్ రూ. 35 లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్ మారుతి
రజనీ-లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ .. టీజర్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే
ప్రయాణికుడి లగేజ్‌బాగ్ చూసి షాకైన అధికారులు.. స్మగ్లింగ్ చేయటానికి ఇంకేం దొరకలేదారా ??