Candida Infection: అమెరికాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ 'కాండిడా ఆరిస్'!ఆ రోగులకు ఇన్ఫెక్షన్‌!

Candida Infection: అమెరికాలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ‘కాండిడా ఆరిస్’!ఆ రోగులకు ఇన్ఫెక్షన్‌!

Anil kumar poka

|

Updated on: Feb 05, 2024 | 7:08 PM

అమెరికాలో ‘క్యాండిడా ఆరిస్’ అనే ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. జనవరి నెలలో వాషింగ్టన్ రాష్ట్రంలో నలుగురు వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇన్ఫెక్షన్ అరుదైనదే అయినప్పటికీ అత్యంత హానికరమైనదని వైద్య నిపుణులు హెచ్చరించారు. మరణాల రేటు అధికమని, దీని చికిత్సలో ఔషధాల ప్రభావం తక్కువగా ఉండడం, వైద్య వ్యవస్థ ద్వారా సులభంగా వ్యాప్తి చెందగల లక్షణాలు ఉండడంతో ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ప్రమాదకరమని వైద్య నిపుణులు అప్రమత్తత ప్రకటించారు.

అమెరికాలో ‘క్యాండిడా ఆరిస్’ అనే ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. జనవరి నెలలో వాషింగ్టన్ రాష్ట్రంలో నలుగురు వ్యక్తులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇన్ఫెక్షన్ అరుదైనదే అయినప్పటికీ అత్యంత హానికరమైనదని వైద్య నిపుణులు హెచ్చరించారు. మరణాల రేటు అధికమని, దీని చికిత్సలో ఔషధాల ప్రభావం తక్కువగా ఉండడం, వైద్య వ్యవస్థ ద్వారా సులభంగా వ్యాప్తి చెందగల లక్షణాలు ఉండడంతో ఈ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ప్రమాదకరమని వైద్య నిపుణులు అప్రమత్తత ప్రకటించారు. ఈ ఏడాది ‘క్యాండిడా ఆరిస్’ మొదటి కేసు జనవరి 10న నిర్ధారణ అయ్యింది. గత వారం మూడు కేసులు పాజిటివ్‌గా తేలినట్టు ‘సియాటెల్ అండ్ కింగ్ కౌంటీ’ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. ఇది రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులకు సోకుతుందని, పలు ప్రభావవంత యాంటీ ఫంగల్ మందులు దీని చికిత్సలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. హాస్పిటల్స్‌లో ఫీడింగ్ ట్యూబ్‌లు, బ్రీతింగ్ ట్యూబ్‌లు ఉపయోగించే రోగులకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్‌ సోకుతున్నట్టు గుర్తించారు. వివిధ శరీర భాగాలలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందని అమెరికా హెల్త్ ఏజెన్సీ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సీడీసీ రిపోర్ట్ పేర్కొంది. సోకిన ప్రదేశాన్ని బట్టి తీవ్రత ఉంటోందని వివరించింది. 15 సంవత్సరాల క్రితం జపాన్‌లో ‘కాండిడా ఆరిస్’ కేసులు తొలిసారి నమోదయ్యాయి. ఆ తర్వాతి కాలంలో అవి విపరీతంగా పెరిగిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఈ ఫంగస్‌ను పెరుగుతున్న ముప్పుగా గుర్తించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..