Bear attack: వంటింట్లోకి చొరబడ్డ ఎలుగుబంటి.. భయంతో ఆ దంపతులు ఏంచేశారంటే..
సడెన్‌గా ఓ పెద్ద ఎలుగుబంటి మన ఇంట్టో చొరబడిందనుకోండి ఏంచేస్తాం.. భయంతో కేకలు వేస్తూ పారిపోతాం కదా.. కానీ ఇక్కడ సీన్ మరోలా ఉంది. తమ ఇంట్లో చొరబడిన ఎలుగుబంటిని ధైర్యంగా ఎదుర్కొంది ఓ జంట.
సడెన్‌గా ఓ పెద్ద ఎలుగుబంటి మన ఇంట్టో చొరబడిందనుకోండి ఏంచేస్తాం.. భయంతో కేకలు వేస్తూ పారిపోతాం కదా.. కానీ ఇక్కడ సీన్ మరోలా ఉంది. తమ ఇంట్లో చొరబడిన ఎలుగుబంటిని ధైర్యంగా ఎదుర్కొంది ఓ జంట. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్‌లో వెలుగు చూసింది. ఇంటి బయట పిట్టల కోసం పెట్టిన ఆహారాన్ని ఒక పెద్ద ఎలుగు బంటి వచ్చి తినడాన్ని ఆ ఇంట్లో ఉన్న జంట చూశారు. దానిని వెళ్లగొట్టే ప్రయత్నంలో కేకలు వేస్తూ బెదిరించారు కూడా.. కానీ వాళ్ల అరుపులకు రెచ్చిపోయిన ఎలుగు.. పక్కనే ఉన్న కిటికీ బద్దలుకొట్టి ఆ ఇంట్లో చొరబడింది. దాంతో భయపడిపోయిన ఆ జంట.. వంట గదిలో ఉన్న కత్తులు తీసుకొని దానిపై రివర్స్ ఎటాక్ చేశారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కాసేపు పోరాడిన తర్వాత ఇంట్లో ఉన్న తుపాకీతో ఆ ఎలుగు బంటిని కాల్చి చంపేసారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఆ జంటను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. పక్క గదిలో పడుకొని ఉన్న వాళ్ల పిల్లలకు ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు. ఇటీవలి కాలంలో విస్కాన్సిన్ ప్రాంతంలో ఎలుగు బంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!