మూడో ప్రపంచయుద్ధమే వస్తే .. ఈ దేశాలు సేఫేనా ??

Updated on: May 21, 2025 | 4:23 PM

రెండు ప్రపంచ యుద్దాలు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. హిరోషిమా నాగసాకి నగరాలపై అమెరికా జారవిడిచిన అణుబాంబులు దాదాపు 2 లక్షలకుపైగా జపాన్‌ పౌరులను బలితీసుకున్నాయి. అప్పటికప్పుడు చాలా మంది మరణిస్తే.. మిగిలిన వారంతా రేడియేషన్‌ ప్రభావానికి గురై ప్రాణాలు విడిచారు. 78 ఏళ్లు గడిచినా నేటికీ ఎంతోకొంత ప్రభావం చూపుతూనే ఉంది.

ప్రస్తుతం అనేక దేశాలు అణు బాంబులు కలిగి ఉన్నాయి. అయితే జపాన్ బాంబు దాడులకు సంబంధించి హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు కనిపిస్తుండటం వల్ల వాటిని ఉపయోగించడానికి ప్రభుత్వాలు ఇష్టపడటంలేదు. జపాన్ అణు యుద్ధాన్ని చూసిన వారు ఇప్పుడు దాదాపుగా ఎవరూ లేరు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఎక్కడో చోట ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో న్యూక్లియర్ వార్ భయాలు నెలకొన్నాయి. ఒకవేళ అణు యుద్ధం సంభవించినా ఓ 5 నుంచి 10 దేశాలు మాత్రం సురక్షితంగా ఉంటాయట. వాటి ప్రత్యేక భౌగోళిక స్థితి, తటస్థ వైఖరితో అణు దాడి నుంచి తమ ప్రజలను రక్షించుకోగలవు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం అప్రకటిత మూడో ప్రపంచ యుద్ధంలోకి వెళ్లిపోయింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య బాంబుల మోతలు ఇంకా అలాగే ఉండగానే.. పశ్చిమాసియా రగులుతోంది. అంతకంతకూ యుద్ధం విస్తరించుకుంటూ పోతోంది. ఇజ్రాయెల్ , ఇరాన్ ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. ఇది పశ్చిమాసియా మొత్తాన్ని సర్వనాశనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలెక్టర్ కావాలని ఆశపడ్డ పేద విద్యార్థికి.. అండగా నిలిచిన కమల్ హాసన్

అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ..!

సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్‌ అబ్బో

OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్‌

హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..