అప్పుడు అదృష్టం కలిసిరాలేదు.. ఇప్పుడు విశాల్‌ను పెళ్లి చేసుకుంటూ..!
ఎట్టకేలకు విశాల్ వివాహం పై క్లారిటీ వచ్చింది. నటి సాయి ధన్సిక ను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్, సాయి ధన్సిక. అంతే కాదు తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు. కాగా విశాల్ పెళ్లాడబోతున్న ధన్సిక ఎవరో తెలుసా.? తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక.
ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా క్రేజ్ రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. ఇక ఇప్పుడు విశాల్ ను పెళ్లి చేసుకోబోతుంది సాయి ధన్సిక. విశాల్ వయసు 47, ధన్సిక వయసు 35 ఏళ్ల. ఇద్దరి మధ్య 12 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా మాదిరి ప్రేమ కథ! ట్విస్ట్ అండ్ టర్న్స్ అబ్బో
OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
