‘ధురందర్’ పాక్‌ ఆసిమ్ మునీర్‌కు వెన్నులో వణుకు

Updated on: Dec 29, 2025 | 5:37 PM

పాక్ సైనిక నియంత ఆసిమ్ మునీర్ భారత 'ఆపరేషన్ సింధూర్'తో కలవరపడి, చైనా, టర్కీల నుండి ఆయుధాలు కొంటున్నాడు. అయితే, బాలీవుడ్ 'దురంధర్' సినిమా అతని నిజమైన భయం. ఈ చిత్రం పాక్ సైన్యం-ఐఎస్ఐ ఉగ్రవాద సంబంధాలను, కరాచీ అండర్‌వరల్డ్‌ను కళ్లకు కట్టింది. నిషేధం ఉన్నా వైరల్ అయిన ఈ సినిమా, రాబోయే పార్ట్ 2తో ఉన్నత జనరల్స్ ముఖాలను బయటపెట్టనుంది. మిస్సైళ్లకంటే ఈ 'సినిమా ఆయుధం' మునీర్‌ను వణికించేస్తోంది.

పాక్‌ సైనిక నియంత, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ భయంలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్ సింధూర్’ దెబ్బకు విలవిలలాడిన పాక్.. ఇప్పుడు చైనా నుంచి ఐదో తరం యుద్ధ విమానాలు, టర్కీ నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొంటోంది. భారత్ ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణుల నుంచి రక్షణ పొందేందుకు వేల కోట్లు ఖర్చు చేస్తుంది. కానీ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ధురందర్’ఆయుధానికి మునీర్ దగ్గర ఎలాంటి విరుగుడు లేదు. దురంధర్‌లో ఆదిత్య ధర్‌ పాకిస్థాన్ ‘డీప్ స్టేట్’ సైన్యం-ఐఎస్ఐ కూటమి ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోందో కళ్లకు కట్టినట్లు చూపించారు. 2000వ దశకంలో కరాచీని శాసించిన రెహమాన్ దకైత్, ఉజైర్ బలోచ్ వంటి మాఫియా డాన్లతో పాక్ సైన్యానికి ఉన్న సంబంధాలను ఈ సినిమా బయటపెట్టింది. కరాచీ అండర్‌వరల్డ్ మాఫియాని ఈ సినిమా వెండితెరపై ఆవిష్కరించింది. పాక్ ప్రభుత్వం ఈ సినిమాను నిషేధించినా కోట్లాది మంది ప్రజలు దీనిని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు పాకిస్థాన్‌లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ అంటే పాక్ నియంతలకు ఎప్పుడూ భయమే. 2004లో అప్పటి నియంత పర్వేజ్ ముషార్రఫ్ కూడా ఐశ్వర్యరాయ్ కు “పాక్ వ్యతిరేక సినిమాల్లో నటించకండి” అని ఉచిత సలహా ఇచ్చారు. కార్గిల్ యుద్ధం, 26/11 ముంబై దాడులు, పార్లమెంటు దాడి వెనుక పాక్ సైనిక కుట్రను బాలీవుడ్ ఎండగడుతోంది. వచ్చే ఏడాది మార్చిలో రాబోతున్న ఈ సినిమా పార్ట్‌ 2… పాక్ సైన్యంలోని ఒక ఉన్నత స్థాయి జనరల్ అసలు ముఖాన్ని బయటపెట్టబోతోందని సమాచారం. గతంలో భారత్‌పై ఉగ్రదాడులు చేయించిన జావేద్ నాసిర్, హమీద్ గుల్ వంటి జనరల్స్ చరిత్రను ఇది గుర్తు చేయబోతోంది. మొత్తానికి పాక్ కొంటున్న చైనా యుద్ధ విమానాలు సరిహద్దుల్లో పని చేస్తాయేమో కానీ.. సామాన్యుల గుండెల్లోకి చొచ్చుకుపోతున్న ఈ ‘సినిమా ఆయుధం’ ముందు ఆసిమ్ మునీర్ నిస్సహాయుడిగా మారిపోయారని తెలుస్తోంది. తన అసలు రంగు బయటపడుతుందేమోనని గజగజా వణికిపోతున్నట్లు సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

షుగర్ పేషంట్స్‌కి స్వీట్ వార్నింగ్.. చెక్కర కంటే బెల్లం యమా డేంజర్ గురూ

ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..

షాపింగ్ చేయడం కూడా ఒక రోగమే.. దాని వాళ్ళ కలిగే నష్టాలు తెలిస్తే షాకే