kim jong un’s speech: హృదయాలను తడిమిన కిమ్ ప్రసంగం.. వెక్కివెక్కి ఏడ్చిన ఆర్మీ డాక్టర్స్..
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చూడ్డానికి కఠినంగా కనిపిస్తారు. అయితే కిమ్ తాజాగా తమ దేశ ఆర్మీ వైద్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారి హృదయాలను తడిమేశాయి.
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ చూడ్డానికి కఠినంగా కనిపిస్తారు. అయితే కిమ్ తాజాగా తమ దేశ ఆర్మీ వైద్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వారి హృదయాలను తడిమేశాయి. కిమ్ ప్రసంగం వింటూనే వైద్యులు కంటతడి పెట్టుకున్నారు. చిన్నపిల్లల్లా వెక్కివెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.కరోనా సమయంలో కీలక సేవలు అందించిన ఆర్మీ వైద్యులను సన్మాన సభలో కిమ్ ప్రసంగిస్తుండగా ఆర్మీ వైద్యులు వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించారు. మహమ్మారితో పోరాడేందుకు ఆర్మీ వైద్యులతో ‘కరోనా పోరాట ఫ్రంట్’ పేరుతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. వారిని దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపి కరోనాకు అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది. కాగా కిమ్ ప్రసంగిస్తూ వారి సేవలను కొనియాడారు. వారి కష్టాన్ని గుర్తిస్తూ ప్రశంసలు కురిపించారు. కరోనాపై పోరులో ఉత్తర కొరియా సాధించిన విజయం అద్భుతమని వ్యాఖ్యానించారు. అది విన్న మిలటరీ వైద్యులు, ఇతర అధికారులు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..