Garcetti: దసరా ఉత్సవాల్లో అమెరికా రాయబారి ధనుచి డాన్స్‌.. అదరగొట్టాడుగా..! వీడియో.

Garcetti: దసరా ఉత్సవాల్లో అమెరికా రాయబారి ధనుచి డాన్స్‌.. అదరగొట్టాడుగా..! వీడియో.

Anil kumar poka

|

Updated on: Oct 23, 2023 | 8:41 PM

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా ఆథ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. విదేశీయులను సైతం విజయదశమి వేడుకలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా, భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఢిల్లీలోని చిత్తరంజన్ పార్కులో బెంగాలీ ప్రజలు ఏర్పాటు చేసిన దుర్గా మంటపాన్ని ఎరిక్ గార్సెట్టి సందర్శించారు.

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా ఆథ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. విదేశీయులను సైతం విజయదశమి వేడుకలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. తాజాగా, భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఢిల్లీలోని చిత్తరంజన్ పార్కులో బెంగాలీ ప్రజలు ఏర్పాటు చేసిన దుర్గా మంటపాన్ని ఎరిక్ గార్సెట్టి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బెంగాలీ సంప్రదాయ కళ అయిన ధునుచి నృత్యాన్ని చేశారు. అమ్మవారికి హారతి ఇచ్చిన గార్సెట్టి.. నోటితో నిప్పుల కుంపటిని పట్టుకుని నృత్యం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దుర్గా మాతను దర్శించుకునేందుకు విచ్చేసిన గార్సెట్టీకి రుచికరమైన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు స్థానికులు. ఝాల్ మురి, బిర్యానీ, ఫిష్ వంటకాలు, బెంగాలీ స్వీట్లను ఆయన ఇష్టంగా తిన్నారు. తన పర్యటన తాలూకు వీడియోను గార్సెట్టి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. శుభో పూజో అంటూ బెంగాలీలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..