ఊరూరా ఉగ్రకుక్కలు..విషం చిమ్మే డాక్టర్లు.. మెదళ్లను పొడిచే ప్రొఫెసర్లు వీడియో
ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో వైట్ కాలర్ టెర్రర్ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. వైద్యులు, ప్రొఫెసర్ల ముసుగులో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఫరీదాబాద్‌లోని అల్ ఫలహ్ యూనివర్సిటీ ఈ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పాకిస్థాన్ ఈ పాన్-ఇండియా కుట్రకు పథకం రచించిందని వెల్లడైంది.
ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనతో ముడిపడి ఉన్న పాన్-ఇండియా ఉగ్ర కుట్రను దర్యాప్తు సంస్థలు వెలికితీశాయి. ఈ నెట్‌వర్క్‌లో వైద్యులు, ప్రొఫెసర్లు భాగస్వాములైనట్లు గుర్తించారు, దీనిని “వైట్ కాలర్ టెర్రర్”గా అభివర్ణించారు. పాకిస్థాన్ ఈ కుట్రకు పథకం రచించిందని, దీని లక్ష్యం దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించడమేనని తెలుస్తోంది. ఫరీదాబాద్‌లోని అల్ ఫలహ్ యూనివర్సిటీ ఉగ్రవాదులకు ఒక కేంద్రంగా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అల్ ఫలహ్ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ నబీ ఢిల్లీ బ్లాస్ట్‌లో సూసైడ్ బాంబర్‌గా అనుమానిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
Published on: Nov 13, 2025 04:23 PM
