పందుల కోసం స్టార్‌ హోటల్ లాంటి భవనం.. బిల్డింగ్ చూసి షాక్ అవుతున్న నెటిజన్స్.. ఎక్కడంటే..?

పందుల కోసం స్టార్‌ హోటల్ లాంటి భవనం.. బిల్డింగ్ చూసి షాక్ అవుతున్న నెటిజన్స్.. ఎక్కడంటే..?

Anil kumar poka

|

Updated on: Aug 30, 2022 | 8:37 AM

ఈ ఆకాశహర్మ్యం ఉన్నది చైనాలో.. అయితే.. మన కోసం కాదు.. స్టార్‌ హోటల్‌ను తలపిస్తున్న ఈ 26 అంతస్తుల భవనాన్ని పందుల కోసం నిర్మిస్తున్నారు. షాక్‌ అవ్వాల్సిన పని లేదు. నిజమే..


ఈ ఆకాశహర్మ్యం ఉన్నది చైనాలో.. అయితే.. మన కోసం కాదు.. స్టార్‌ హోటల్‌ను తలపిస్తున్న ఈ 26 అంతస్తుల భవనాన్ని పందుల కోసం నిర్మిస్తున్నారు. షాక్‌ అవ్వాల్సిన పని లేదు. నిజమే.. పందుల పెంపకం కోసం ఇంత పెద్ద భవనం నిర్మించడం ప్రపంచంలోనే మొదటిసారి. చైనాలో ప్రధాన ఆహారమైన పోర్క్‌ ఉత్పత్తిని పెంచడానికి, తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఇలాంటి భవనాల్లో పందులను పెంచుతున్నారు.ఎగుమతుల కోసం పందుల పెంపకంపై దృష్టిపెట్టిన చైనా, ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో ఫార్మింగ్‌కు అనుమతించింది. మొదట రెండు మూడు అంతస్తులతో మొదలైన ఈ ఫార్మింగ్‌ ఇప్పుడిలా 26 అంతస్తులకు చేరింది. అక్కడి పందులకు యంత్రాలే ఆహారాన్ని సరఫరాచేస్తాయి.గాలి శుద్ధీకరణ, పందుల వ్యర్థాలతో బయోగ్యాస్‌ ప్లాంట్ ఇలా అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనం ప్రారంభమైతే నెలకు 54వేల టన్నులు, ఏడాదికి 60 లక్షల టన్నులు పోర్క్‌ ఉత్పత్తి చేయనుంది. గతంలో యూరప్‌లోనూ ఇలాంటి నిర్మాణాలున్నా.. వివిధ కారణాలతో చాలా మూతపడ్డాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..

Groom Cake Viral: వీడేం పెళ్ళికొడుకు.. వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా..!

Published on: Aug 30, 2022 08:37 AM