old woman arrest: ఇదో సరదా మరి.. అడిగి మరీ అరెస్టయింది.! ఎందుకో తెలుసా..
వందేళ్ల బామ్మ జీన్ బికెంటన్ ఆస్ట్రేలియాలో కొన్నేళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైంది. తమ వారితో తన వందో పుట్టినరోజు వేడుకలు ఫుల్ జోష్‌గా జరుపుకుంటోంది. ఉన్నట్టుండి పోలీసులు రంగప్రవేశం చేశారు.
వందేళ్ల బామ్మ జీన్ బికెంటన్ ఆస్ట్రేలియాలో కొన్నేళ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమైంది. తమ వారితో తన వందో పుట్టినరోజు వేడుకలు ఫుల్ జోష్‌గా జరుపుకుంటోంది. ఉన్నట్టుండి పోలీసులు రంగప్రవేశం చేశారు. అందరూ చూస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంకెళ్లు వేసి మరీ తీసుకెళ్లారు. కానీ, షాకవ్వాల్సింది పోయి బామ్మ చప్పట్లు కొడుతూ సంబరపడిపోయింది. పైగా ఆహూతులంతా ఆమెతో శ్రుతి కలిపారు. ఎందుకంటారా? ఎందుకంటే జరిగింది ఉత్తుత్తి అరెస్టే కాబట్టి. అసలు సంగతేమిటంటే జీవితంలో ఒక్కసారైనా అరెస్టు కావాలన్నది ఈ బామ్మ చిరకాల వాంఛ. తర్వాత అంతా కలిసి ఇలా ఫొటోలు దిగి సందడి చేశారు. విక్టోరియా పోలీసు శాఖ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇది కమ్యూనిటీ పోలీసింగ్‌కు అద్దం పట్టిందంటూ కామెంట్లు వస్తున్నాయి. పుట్టిన రోజునాడు పెద్దావిడకు గొప్ప కానుక ఇచ్చారంటూ కొందరు మెచ్చుకున్నారు. ఈ బామ్మ ఆర్మీలో నర్సుగా సుదీర్ఘకాలం పని చేసి రిటైరయ్యారట. తన చిరకాల కోరికను సెకండ్ ఇన్నింగ్స్‌లో మొత్తానికిలా తీర్చుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

