Boat Accident: బోటులో వెలిగించిన కొవ్వొత్తులే.. 40 మంది ప్రాణాలు తీశాయి.!

|

Jul 23, 2024 | 11:54 AM

హైతీ నుంచి దాదాపు 80 మంది వలసదారులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. 41 మందిని హైతీ కోస్ట్‌గార్డ్ రక్షించింది. హైతీ నుంచి బయలుదేరిన ఈ బోటు టర్క్స్ అండ్ కాయ్‌కోస్ ఐలాండ్స్‌కు వెళ్తున్నట్టు గుర్తించినట్టు హైతీలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. ప్రయాణం క్షేమంగా సాగాలంటూ బోటులోని ప్రయాణికులు కొవ్వొత్తులు వెలగించి ప్రార్థించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

హైతీ నుంచి దాదాపు 80 మంది వలసదారులతో వెళ్తున్న పడవలో మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. 41 మందిని హైతీ కోస్ట్‌గార్డ్ రక్షించింది. హైతీ నుంచి బయలుదేరిన ఈ బోటు టర్క్స్ అండ్ కాయ్‌కోస్ ఐలాండ్స్‌కు వెళ్తున్నట్టు గుర్తించినట్టు హైతీలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. ప్రయాణం క్షేమంగా సాగాలంటూ బోటులోని ప్రయాణికులు కొవ్వొత్తులు వెలగించి ప్రార్థించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బోటులో ఉన్న పెట్రోల్‌ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా హైతీలో తీవ్రవాద ముఠాలు చెలరేగి మారణహోమం సృష్టిస్తుండడంతో హైతీలు అక్రమ మార్గాల ద్వారా వలసలు వెళ్తూ ఇలా ప్రమాదాల బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.