Aadhar: జూన్‌ 14 తర్వాత వారి ఆధార్‌ పనిచేయదా ??

|

Jun 07, 2024 | 11:48 AM

ఆధార్‌కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్‌ 14 లోపు అప్‌డేట్‌ చేయకపోతే ఆధార్‌ కార్డు పని చేయదంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాథికారిక సంస్థ UIDAI స్పష్టతనిచ్చింది. అలా వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించింది. ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి జూన్‌ 14 గడువు విధించినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్‌ పనిచేస్తుందని స్పష్టం చేసింది.

ఆధార్‌కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్‌ 14 లోపు అప్‌డేట్‌ చేయకపోతే ఆధార్‌ కార్డు పని చేయదంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాథికారిక సంస్థ UIDAI స్పష్టతనిచ్చింది. అలా వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించింది. ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి జూన్‌ 14 గడువు విధించినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్‌ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్‌ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఉడాయ్‌ గతంలో 2023 డిసెంబర్‌ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండుసార్లు పొడిగించి చివరగా జూన్‌ 14 గడువు విధించింది. ఆలోపు ఆన్‌లైన్‌లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి కూడా ఉచితంగా వివరాలు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తాజా గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగాను, ఇటీవల మూడు నెలలకు చెందిన విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Donald Trump: ప్రెసిడెంట్‌ పోటీ నుంచి ట్రంప్‌ తప్పుకోవాలి

మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు.. రియల్‌ హీరో అంటూ ప్రశంసలు

అరుణాచల్‌లో అరుదైన చీమలు.. సియాంగ్‌ లోయలో గుర్తింపు

ఏందన్నా ఇదీ !! నీకు పెళ్లి చేసుకోడానికి పిల్లే దొరకలేదా

చెట్టును రోడ్డుకి అడ్డంగా పడగొట్టి ఏనుగు నిరసన.. నెట్టింట వీడియో వైరల్‌

Follow us on