Watch Video: అమ్మో.. రెప్పపాటులో ప్రమాదం.. వరద‎లో ఆటో బోల్తా.. వైరల్ వీడియో..

Watch Video: అమ్మో.. రెప్పపాటులో ప్రమాదం.. వరద‎లో ఆటో బోల్తా.. వైరల్ వీడియో..

Maqdood Husain Khaja

| Edited By: Srikar T

Updated on: Jul 20, 2024 | 7:49 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత రెండు రోజులగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో విశాఖలో జోరుగా వర్షాలు కురిశాయి. చాలా చోట్ల రోడ్లపైకి వరద నీరు ప్రవహించింది. కొన్నిచోట్ల రోడ్లు ప్రమాదకరంగా మారాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. గత రెండు రోజులగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో విశాఖలో జోరుగా వర్షాలు కురిశాయి. చాలా చోట్ల రోడ్లపైకి వరద నీరు ప్రవహించింది. కొన్నిచోట్ల రోడ్లు ప్రమాదకరంగా మారాయి. అయితే.. ప్రయాణికులతో వెళుతున్న ఓ ఆటో డ్రైవర్ వరద నీటిలో అలాగే ఆటోను ముందుకు పోనిచ్చాడు. డ్రైవర్ అత్యుత్సాహంగా వాహనం నడపడం వల్ల ఆ ఆటో వరద నీటిలో బోల్తా పడింది. గోపాల పట్నం – నరవ రోడ్‎లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్థానికులు అప్రమత్తం కావడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇలా వరద నీటిలో ఎలా పడితే అలా వాహనాలు నడపడం వల్ల పెను ప్రమాదం పొంచి ఉంటుందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..