Tirumala: శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్లు.. వీడియో చూడండి
భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవాలని రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని ప్రార్థించారు. స్వామివారి పురాభిషేకం అనంతరం నైవేద్య విరామ సమయంలో సంప్రదాయ వస్త్రాలతో ఆలయంలోకి వెళ్లి మూలమూర్తిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. వీడియో చూడండి
తిరుమల శ్రీవారిని భారత జట్టు క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవాలని రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని ప్రార్థించారు. స్వామివారి పురాభిషేకం అనంతరం నైవేద్య విరామ సమయంలో సంప్రదాయ వస్త్రాలతో ఆలయంలోకి వెళ్లి మూలమూర్తిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేయగా, టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన పంత్, అక్షర్ పటేల్ తో పలువురు క్రికెట్ అభిమానులు సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Published on: Nov 03, 2023 05:38 PM