అయోధ్యలో శనివారం కీలకఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రధాని మోదీ శనివారం (డిసెంబర్ 31) అయోధ్యలో పర్యటిస్తారు. రూ . 15 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా అయోధ్యలో నిర్మించిన కొత్త ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ తో సహా పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన అనంతరం జాతికి అంకితమివ్వనున్నారు. శ్రీరాముని భక్తికి నిదర్శనంగా అయోధ్య ధామ్ పేరుతో నిర్మించిన నూతన రైల్వే స్టేషన్ ను ఎంతో అద్భుతంగా కట్టించారు. స్టేషన్ ముఖద్వారంపై మకుటం, గోడలపై విల్లు తరహా నిర్మాణాలను ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం 12.15నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్ పోర్టుతో పాటు రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తారు. మోడీ పర్యటన సందర్భంగా అయోధ్యలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. వచ్చే నెల 22వ తేదీన అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్‌ను , ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు 20 రైళ్లు నడిచేలా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్. అయోధ్య రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ , అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ నిర్వహించారు. అయోధ్య నుంచి రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు , ఆరు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తాయి.