US: ఘోర ప్రమాదం.. మిలటరీ హెలికాప్టర్‌ను ఢీకొని కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మిలటరీ హెలికాప్టర్‌ను ఢీకొని కుప్పకూలింది ఓ ప్యాసింజర్ విమానం. వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్ దగ్గర్లో ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్‌ను ఢీకొట్టిన విమానం.. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అటు పొటోమాక్ నదిలో విమాన శకలాలు పడ్డాయి.
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని రీగన్ విమానాశ్రయం సమీపంలో ఈ ఘటన జరిగింది. 60 మందితో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ల్యాండింగ్‌కి రెడీ అయిన టైమ్‌లో.. వాషింగ్టన్ మిలటరీ హెలికాప్టర్‌ను ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. కన్సాస్‌లోని విచితా నుంచి వాషింగ్టన్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన PSA-5342 విమానం ప్రమాదం తర్వాత రెండూ ప్రక్కనే ఉన్న పొటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరుగుతోంది. యూఎస్ పార్క్ పోలీస్, మెట్రోపాలిటన్ పోలీస్, మిలటరీ ఇలా వివిధ ఏజెన్సీలు స్పాట్ దగ్గర రెస్క్యూ, రిలీప్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. ఈ ప్రమాదంతో తాత్కాలికంగా ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్‌లన్నీ నిలిపేశారు.
అయితే బాధితులకు మరో ముప్పు పొంచి ఉంది. ఆ శకలాలు పడిన పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రతలు -1 నుంచి -2 సెల్సియస్ వరకు ఉండొచ్చని అక్కడి నేషనల్ వెదర్ సర్వీస్ చెబుతోంది.
దీనివల్ల ఒక్కసారిగా బాధితుల శరీరాలు కోల్డ్ షాక్‌కు గురికావచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఊపిరాడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా హైపర్ రీవెంటిలేషన్ వంటి పరిస్థితి తలెత్తొచ్చు. వారు అధిక సమయం అదే నీటిలో ఉంటే.. హైపోథెర్మియా అనే పరిస్థితికి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. గాలితో పోలిస్తే మనిషిలోని ఉష్ణోగ్రతను నీరు 26 రెట్లు వేగంగా తగ్గిస్తుంది. శరీరం కంటే నీటి ఉష్ణోగ్రత చాలా తక్కువ కావడంతో కేవలం మూడు నిమిషాల్లోనే మానసికంగా బాగా కుంగిపోతారు. కేవలం 15 నిమిషాల్లో స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అటువంటి వాతావరణంలో గాయపడిన వ్యక్తులు 30 నుంచి 90 నిమిషాలు మాత్రమే బతికే అవకాశం ఉంది. అటు.. ఈ ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మృతులకు సంతాపం తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి