విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్.. రైలు షెడ్యూలులో మార్పు

|

Aug 12, 2024 | 1:34 PM

విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలు షెడ్యూల్ లో మార్పు చోటుచేసుకుంది. విశాఖ-వందే భారత్ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు 10 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ఆదివారం మినహా వారంలోని అన్ని రోజులు నడుస్తోంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.

విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలు షెడ్యూల్ లో మార్పు చోటుచేసుకుంది. విశాఖ-వందే భారత్ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు 10 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలు ఆదివారం మినహా వారంలోని అన్ని రోజులు నడుస్తోంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రూట్లో ఇప్పటికే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నప్పటికీ, రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో వందే భారత్ రైలును కూడా కేంద్రం ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వీటి సేవలను ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. సాధారణ రైళ్లతో పోలిస్తే.. ఇవి వేగంగా ప్రయాణిస్తుండడం, త్వరగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ఎక్కువుగా వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే ఛాన్స్ ఉండడంతో వీటిపై ఆసక్తి నెలకొంది. మరిన్ని వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తే.. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని.. దీనివల్ల తమకు టైమ్ చాలా వరకు కలిసి వస్తుందని ప్రయాణికులు కోరుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముఖం రంగు మారిందా.. బాబోయ్.. అస్సలు లేట్ చేయద్దు..!

సత్యదేవుని ధ్వజస్తంభం బంగారు తాపడానికి.. నెల్లూరు భక్తుడి భారీ విరాళం

మామకు తలకొరివి పెట్టిన కోడలు.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఘటన

ఇంకెన్నాళ్లీ డోలీమోతలు ?? కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌

బైక్‌పై వెళ్తున్న దంపతులు.. కాటెయ్యకుండానే ప్రాణం తీసిన పాము