Zomato: వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!

|

Jul 31, 2024 | 8:40 AM

ప్రస్తుత కాలంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే...వంట చేసుకుని తినేంత సమయం ఎవరికీ ఉండటంలేదు.. దాంతో అందరూ ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారు. క్షణాల్లో నచ్చిన ఆహారం కళ్ల ముందు ప్రత్యక్షమైపోతుంది. ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ఆహారంలో నాణ్యతా లోపం, ఒకటి ఆర్డర్‌ చేస్తే మరో ఆహారం డెలివరీ చేయడం లాంటివి వినియోగదారులు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుత కాలంలో అన్నీ ఆన్‌లైన్‌లోనే…వంట చేసుకుని తినేంత సమయం ఎవరికీ ఉండటంలేదు.. దాంతో అందరూ ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారు. క్షణాల్లో నచ్చిన ఆహారం కళ్ల ముందు ప్రత్యక్షమైపోతుంది. ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ఆహారంలో నాణ్యతా లోపం, ఒకటి ఆర్డర్‌ చేస్తే మరో ఆహారం డెలివరీ చేయడం లాంటివి వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ యువతి వెజ్‌ ఫుడ్ ఆర్డర్‌ చేస్తే నాన్‌వెజ్‌ ఫుడ్ ను డెలివరీ చేశారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ ఇస్తే మాంసాహార వంటకం పార్సిల్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. ‘‘ జొమాటో ద్వారా ఈట్‌ఫిట్ నుంచి పాలక్ పనీర్ సోయా మటర్, మిల్లెట్ పులావ్ ఆర్డర్ చేశాను. అయితే పాలక్ పనీర్‌కు బదులు చికెన్ పాలక్‌ని డెలివరీ చేశారు. నేను శాకాహారం మాత్రమే ఆర్డర్ పెట్టినప్పుడు చికెన్ ఎలా డెలివరీ చేస్తారు అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన జొమాటో క్షమాపణ కోరింది. సమస్యను పరిశీలిస్తున్నామని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చింది. తప్పును సరిదిద్దుకుంటామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై ఈట్‌ఫిట్ రెస్టారెంట్ కూడా క్షమాపణలు కోరింది. ‘‘మీకు ఎదురైన అనుభవం పట్ల చింతిస్తున్నాం. దయచేసి మీ ఆర్డర్, సంప్రదింపు వివరాలు అందించండి’’ అని కోరింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on