వేలకోట్లకు అధిపతి.. అయినా సైకిల్‌పైనే సవారీ

Updated on: Oct 16, 2025 | 4:48 PM

ఎవరైనా కాస్త డబ్బు సంపాదించగానే తమ గత జీవితాన్ని మర్చిపోతారు. తాము డబ్బులోనే పుట్టి పెరిగినట్టుగా బిహేవ్‌ చేస్తారు. కానీ కొంతమంది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టుగా ఉంటారు. వేలకోట్లకు అధిపతులైనా సాధారణ జీవితాన్ని గడుపుతారు. వాళ్లు ఎంత కష్టపడితే ఆ స్థాయికి చేరుకున్నారో వారు ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి ఓ వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈయన దాదాపు 28 వేల కోట్ల ఆస్తికి అధిపతి. కానీ ఇప్పటికీ సైకిల్ మీదే ప్రయణం చేస్తుంటారు. ఆయనే తమిళనాడుకు చెందిన శ్రీథర్‌ వెంబు. ఈయన 1968లో తంజావూరులో జన్మించారు. ఆయ‌న తండ్రి చెన్నై హైకోర్టులో స్టెనోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశారు. త‌ల్లి సాధారణ గృహిణి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన శ్రీధర్..ఐఐటీ జేఈఈ ఎగ్జామ్‌లో జాతీయ స్థాయిలో 27వ ర్యాంకు సాధించి.. ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత.. పై చదువుల కోసం అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. చదువు పూర్తైన వెంటనే 1994లో క్వాల్ కామ్ లో చేరి.. దీర్ఘకాలం అక్కడే పని చేశారు. అయితే.. చిన్నప్పటినుంచి ఓ స్టార్టప్‌ కంపెనీని పెట్టాలని ఆయన కోరిక. జీవితంలో కాస్త స్థిరపడగానే.. మంచి జీతం వచ్చే జాబ్‌ను వదిలేసారు. అయితే అప్పటికే ఆయన సోదరుడు చెన్నైలో అడ్వెంట్ నెట్ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని నడపుతున్నారు. 2001లో ఆర్థిక మాంద్యం సమయంలో అడ్వెంట్ నెట్ భారీగా నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో జోహో డొమైన్ నేమ్‌ను శ్రీధర్ వెంబ్ కొనుగోలు చేశారు. 2009లో తన కంపెనీలో సోదరుడికి అడ్వెంట్ నెట్ కంపెనీని విలీనం చేశారు. ఆ తర్వాత శ్రీథర్‌ వెనుదిరిగి చూడలేదు. అంతేకాక 2021 నవంబర్ నాటికి జోహో కంపెనీ ఆదాయం 1 బిలియన్ డాలర్లకు చేరింది. కొవిడ్ టైమ్ లో కూడా ఈ కంపెనీ భారీ లాభాలు పొందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి. అయినా శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన నికర ఆస్తి విలువ 28 వేల కోట్లని అంచనా. ఫోర్బ్స్ డేటా ప్రకారం, భారతదేశంలోని రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో శ్రీధర్ వెంబు 55వ స్థానంలో ఉన్నారు. శ్రీధర్ వెంబు సేవలకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ, శ్రీధర్ వెంబు తన స్వగ్రామం తంజావూరులో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. రోజుకో ఖరీదైన సూటు వేసుకునే అవకాశం ఉన్నా.. అతి సాధారణమైన పంచె, చొక్కాలు ధరిస్తారు. లగ్జరీ కార్లలో విలాసంగా తిరిగే ఛాన్స్‌ ఉన్నా సైకిల్‌ను మాత్రమే తన వాహనంగా ఉపయోగిస్తారు. ఎందుకు అలా అని అంటే.. అలా జీవించడమే తనకు ఇష్టమంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్‌లోనే రిచ్చెస్ట్ మహిళ రోష్ని.. ఆస్తి విలువ తెలిస్తే మైండ్ బ్లాకే

Nayanthara: నయనతార అందుకే నెం.1 హీరోయిన్‌

హైకోర్టులో హీరోకు వింత అనుభవం.. నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి

OTTలోకి సూపర్ హిట్ మూవీ కొత్తలోక

నరేష్‌కు కాబోయే భార్య ఈమే.. త్వరలో పెళ్లి