బైకుపై రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదం.. ఆ తర్వాత
రైల్వే క్రాసింగ్ రైలు పట్టాలు దాటి వాహనదారులు, పాదచారులు వెళ్తుంటారు. రైలు వచ్చే సమయంలో అక్కడి సిబ్బంది రైల్వే గేటు మూసి వేస్తారు. రైలు వెళ్లిపోయిన తర్వాత గేటు తెరవగానే తిరిగి జనాలు ప్రయాణాలు కొనసాగిస్తారు. కానీ కొందరు మాత్రం గేటు మూసి వేసినా రైలు ఇంకా రావడంలేదు కదా అని మొండిగా రైల్వే గేటు దాటేందుకు ప్రయత్నిస్తారు.
ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతూ ఓ వ్యక్తి ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని దాద్రి ప్రాంతంలో నివసించే తుషార్ ఆదివారం బైక్‌పై నోయిడా వెళ్లాడు. బైక్‌పై వెళ్తున్న తుషార్ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. దూరంగా పట్టాలపైనుంచి రైలు వస్తోంది. అయినా ఆ వ్యక్తి రైలు వచ్చే లోపు పట్టాలు దాటేయాలని భావించి వేగంగా బైక్‌పై పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో బైక్ స్కిడ్ అయి పట్టాలపై పడిపోయాడు. కంగారు పడిన అతను వెంటనే పైకి లేచిన బైక్ తీయబోయాడు. వేగంగా రైలు రావడాన్ని గమనించి తప్పించుకునేందుకు పరుగెత్తాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.. రైలు అతన్ని ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తుషార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్థానికుకల సమాచారంతో అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు తుషార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్‌లో అప్ఘాన్ మంత్రి.. వణుకుతున్న పాక్
ఏనుగుల గుంపు బీభత్సం.. నిద్రపోతున్నవారిపై దాడి
ఉపవాసం ఉన్న మహిళ.. గుండెపోటుతో కర్వాచౌత్ నాడు మృతి
యుద్ధాలు ఆపడంలో నేనే తోపు.. మరోసారి ట్రంప్ సొంత డబ్బా
ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? రూ.2 లక్షల మోసం గురించి మీకు తెలుసా?
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

