ఏనుగుల గుంపు బీభత్సం.. నిద్రపోతున్నవారిపై దాడి
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అడవి నుంచి జనావాసాల్లోకి చొరబడిన ఏనుగుల గుంపు దాడిలో నానమ్మ, ఆమె మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. వాల్పారై సమీపంలోని వాటర్ ఫాల్స్ ఎస్టేట్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. వాటర్ ఫాల్స్ తేయాకు తోటలోని కార్మికుల నివాస ప్రాంతంలోకి సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఓ ఏనుగుల గుంపు ఆహారం కోసం ప్రవేశించింది.
ఆ సమయంలో ఇళ్లలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏనుగుల గుంపు ఓఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలు, ఆమె మనవరాలుపై ఒక్కసారిగా దాడి చేసింది. వారు తేరుకునేలోపే ఏనుగులు వారిని తొక్కి చంపేశాయి. చుట్టుపక్కల వారు శబ్దాలు విని బయటకు వచ్చి చూసేసరికే జరగరాని నష్టం జరిగిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏనుగుల సంచారాన్ని పర్యవేక్షించేందుకు ఆ ప్రాంతంలో అదనపు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, గస్తీని ముమ్మరం చేస్తామని వారు హామీ ఇచ్చారు. అయితే, ఈ ప్రాంతంలో ఏనుగుల దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. వాల్పారై ప్రాంతం ఆనమలై టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటంతో ఇక్కడ ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది. వరుస ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల దాడుల నుంచి తమను కాపాడాలని, శాశ్వత పరిష్కారం చూపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉపవాసం ఉన్న మహిళ.. గుండెపోటుతో కర్వాచౌత్ నాడు మృతి
యుద్ధాలు ఆపడంలో నేనే తోపు.. మరోసారి ట్రంప్ సొంత డబ్బా
ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? రూ.2 లక్షల మోసం గురించి మీకు తెలుసా?
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

