ఉపవాసం ఉన్న మహిళ.. గుండెపోటుతో కర్వాచౌత్ నాడు మృతి
వయసుతో సంబంధం లేకుండా మనుషులు పిట్టల్లా రాలిపోతున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు సరదాగా, బలంగా కనిపించిన వ్యక్తులు.. డ్యాన్స్ చేస్తూ, ఆటలాడుతూ సంతోషంలో ఉన్న వాళ్లు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో అక్టోబర్ 12 రాత్రి ఒక మహిళ చనిపోయిన తీరు షాక్‌కు గురిచేస్తుంది.
పంజాబ్ బర్నాలాలో 59 ఏళ్ల ఆశ రాణి డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కర్వా చౌత్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డాన్స్ చేస్తూ పడిపోయింది. చుట్టూ ఉన్న వాళ్లకు పోటాపోటీగా ఆడుతూ అలాగే కూలిపోవడంతో అందరూ షాకయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. కర్వా చౌత్ సందర్భంగా ఆ మహిళ ఆ రోజు భక్తితో ఉపవాసం ఉందని.. ఎలాంటి ఆహారం తీసుకోకుండా రోజంతా వేడుకలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాప మండి బాఘ్ కాలనీలో జరిగిన ఉత్సవాలలో డ్యాన్స్ చేస్తూ ఆయాసంతో పడిపోయినట్లు చెప్పారు. వేడుకల్లో భాగంగా ఆశారాణి తన మనుమరాలితో కలిసి ఆమె ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్వహిస్తున్న వేడుకలో పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. చంద్రుడిని జల్లెడలో చూసి భర్త చేతిలో తాగునీరు అందుకోవాలని భావించి అంతకు ముందు ఆడుతూ ఆడుతూ అలాగే కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయిందని ఆమె భర్త తార్సెన్ లాల్ చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యుద్ధాలు ఆపడంలో నేనే తోపు.. మరోసారి ట్రంప్ సొంత డబ్బా
ఆన్ లైన్ లో సరుకులు ఆర్డర్ చేస్తున్నారా? రూ.2 లక్షల మోసం గురించి మీకు తెలుసా?
వేగంగా దూసుకెళ్తున్న కారు.. ఒక్కసారిగా
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

