Youngman-google job: గూగుల్‌లో జాబ్ వచ్చిన ఆనందంతో యువకుడు ఏం చేసాడో తెలుసా..! వీడియో.
ఓ యువకుడు ఎలాగైనా గూగుల్‌లో జాబ్ సంపాదించాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా ఎనిమిదేళ్లు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చివరికి సాధించాడు.
తన కల సాకారమైన వేళ ఆ యువకుడి ఆనందానికి హద్దులేకుండాపోయింది. గూగుల్ లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం సాధించాలని చాలామంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కేరళకు చెందిన అద్విన్ రాయ్ నెట్టో కూడా గూగుల్‌లో జాబ్ చేయాలని అనుకున్నాడు. అందుకోసం చాలాసార్లు ప్రయత్నించాడు. ఎనిమిదేళ్ల తర్వాత అద్విన్ కల నిజమైంది. ఈమధ్యే గూగుల్‌లో ప్రొడక్ట్ డిజైనర్‌గా జాబ్ తెచ్చుకున్నాడు. ఉద్యోగం సాధించిన విషయాన్నిఅతను తన తల్లి, భార్యతో పంచుకున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో అద్విన్ పెంపుడు కుక్కని పట్టుకున్నవాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లి నవ్వుతూ నిలబడ్డాడు. కొడుకు ముఖంలో ఆనందాన్ని గ్రహించి ఏం జరిగిందని తల్లి అడిగింది. ఇంతలో అతని భార్య ఎంతో ఉత్కంఠతో ‘గూగుల్‌లో ఉద్యోగం వచ్చిందా?’ అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. అద్విన్ రాయ్ ‘అవును’ అని చెప్పడంతో అతని తల్లి సంతోషంతో డాన్స్ చేసింది. అద్విన్ భార్య అతడిని కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నిజంగా ఇదొక అద్భుత దృశ్యం. కల సాకారమైనప్పుడు వారి కళ్లలో ఆనందం కుటుంబ సభ్యుల సంతోషం అపురూపమైన అనుభూతి. అద్విన్ ఈ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అద్విన్ ‘తాను 2013 నుంచి గూగుల్‌లో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నానని, ప్రతి ఏడాది దరఖాస్తు చేస్తునే ఉన్నానని చెప్పారు. అయితే పేరున్న కాలేజీలో డిగ్రీ చేయకపోవడమే తనకు జాబ్ రాకపోవడానికి కారణం అని తెలుసుకుని, ప్రొడక్ట్ డిజైనింగ్ మీద పట్టు సాధించానని చెప్పారు. పట్టుదలతో ప్రయత్నిస్తే పెద్ద కంపెనీల్లో జాబ్ తెచ్చుకోవచ్చు అనడానికి నేనే ఉదాహరణ ‘ అని అద్విన్ చెప్పాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

