Heart Attack on Bike: బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు.! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న యువకునికి గుండెపోటు వచ్చి, బైక్ పైనుంచి కింద పడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇండోర్ పరిధిలోని ముసాఖేడీలో చోటుచేసుకుంది.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న యువకునికి గుండెపోటు వచ్చి, బైక్ పైనుంచి కింద పడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగానే ప్రాణాలు కోల్పోయాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న యువకునికి గుండెపోటు వచ్చి, బైక్ పైనుంచి కింద పడ్డాడు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇండోర్ పరిధిలోని ముసాఖేడీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి చెందిన రాహుల్ రైక్వార్‌కు బైక్‌పై వెళుతుండగా గుండెపోటు వచ్చింది. రాహుల్ వయసు 26 ఏళ్లు. రాహుల్ తన తమ్ముడితో కలిసి ఏదో పనిమీద బైక్‌మీద బయలు దేరాడు. బైక్ వెనుక రాహుల్ కూర్చోగా, అతని తమ్ముడు బైక్ నడుపుతున్నాడు. దారిలో రాహుల్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో బైక్‌పై నుంచి కింద పడిపోయాడు. దీనిని గమనించిన అతని తమ్ముడు చుట్టుపక్కలవారి సాయంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. బాధితుని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. కాగా మృతుడు రాహుల్‌కు ఏడాదిన్నర కుమార్తె ఉంది. కాగా చిన్నవయసులో గుండెపోటుకు ప్రధాన కారణాలు దినచర్యలో మార్పులు, జంక్ ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడి అని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

