ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 120 ఏళ్లుగా.. ఎక్కడుందో తెలుసా ??

ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం గురించి ఎప్పుడైన విన్నారా.. న్యూజిలాండ్‌కు దక్షిణాన దాదాపు 640 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంప్‌బెల్‌ దీవిలో ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 120 ఏళ్లుగా.. ఎక్కడుందో తెలుసా ??

|

Updated on: Oct 14, 2022 | 9:00 AM

ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం గురించి ఎప్పుడైన విన్నారా.. న్యూజిలాండ్‌కు దక్షిణాన దాదాపు 640 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంప్‌బెల్‌ దీవిలో ఉంది. ఈ చిన్నదీవిలో విచిత్ర వాతావరణం ఉంటుంది. ఈ దీవిలో ఏడాదికి 325 రోజులు వర్షం కురుస్తూనే ఉంటుంది. ఏడాదిలో చాలారోజులు రోజులో గంట సేపు మాత్రమే సూర్యుడు కనిపిస్తుంటాడు. ఇక్కడ ఏడాదిలో ఎక్కువ రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రత దాదాపు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతూ ఉంటుంది. ఈ దీవిలో కొన్నేళ్ల కిందట నాటిన ‘సిట్కా స్ప్రస్‌’ వృక్షం 120 ఏళ్లుగా ఈ దీవిలో ఒంటరిగానే ఉంది. ఈ దీవిలో ఎటుచూసినా గడ్డి, చిన్నా చితకా మొక్కలు తప్ప మరో భారీ వృక్షమేదీ కనిపించదు. ఈ వృక్షానికి ఒక అరుదైన విశేషం కూడా ఉంది. దీనికి చేరువలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ భూభాగాల నుంచి, వాటికి దక్షిణాన ఉన్న సముద్రం నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్లో పది శాతం ఈ ఒక్క వృక్షమే పీల్చేసుకుంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళ కడుపులో కత్తెరలు !! ఎలా చేరాయో తెలిస్తే !!

ఇంటికి కాపలా కాస్తున్న భారీ నాగుపాము !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

టిట్ ఫర్ టాట్ అంటే ఇదే.. మోసం చేయాలనుకుంటే ఇలానే మోసపోతారు !!

Follow us