
Viral Video: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇంకొన్ని చోట్ల అయితే ఏకంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. చల్లటి నీటిని కాసేపు అలా ఆరు బయట పెడితే వేడెక్కిపోయే పరిస్థితి ఉంది. ప్రతీ ఏటా ఎండల వేడితో ఆరుబయట ఆమ్లేట్లు వేసిన సందర్భాలను చూసే ఉంటారు.
అయితే ఈసారి ఎండలకు ఏకంగా చపాతీలనే చేసేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఒడిశాలోని సోనేపూర్‌కు చెందిన ఓ మహిళ కారు బ్యానెట్‌పై చపాతీలను చేసేసింది. ఎండ వేడికి అచ్చంగా గ్యాస్ స్టౌవ్‌పై చేసినట్లే చపాతీలు రడీ అయ్యాయి. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం చపాతీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ సమ్మర్‌లో సోలర్ కుక్కర్ తీసుకోవడం ఉత్తమమం, గ్యాస్ బాధల నుంచి తప్పుకోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Scenes from my town Sonepur. It’s so hot that one can make roti on the car Bonnet ? @NEWS7Odia #heatwaveinindia #Heatwave #Odisha pic.twitter.com/E2nwUwJ1Ub
— NILAMADHAB PANDA ନୀଳମାଧବ ପଣ୍ଡା (@nilamadhabpanda) April 25, 2022
మరిన్ని వైరల్ వీడియోలకు క్లిక్ చేయండి..
Also Read: Tamanna Bhatia: డ్రీమ్ రోల్ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా
Hyderabad: ఎర్లీ బర్డ్ ఆఫర్ జీహెచ్‌ఎంసీపై కాసుల వర్షం.. ఎగబడి మరీ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించిన జనం
Manjima Mohan: మంజిమాపై బాడీ షేమింగ్ కామెంట్లు.. తనదైన శైలిలో సమాధానమిచ్చిన మలయాళ ముద్దుగుమ్మ..