Snake Viral Video: దైవమని పూజిస్తే.. కాటేసి ప్రాణం తీసింది.! వీడియో వైరల్.

|

Aug 02, 2024 | 6:56 PM

స్థానికులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన అలుగుల గంగవ్వ అనే 65 ఏళ్ల మహిళ అంగన్‌వాడీ లో ఆయాగా విధులు నిర్వహించి ఇటీవలే పదవి విరమణ పొందింది‌. ఆమె నివాసం ఉండే ఇంట్లో పాము పుట్ట ఉంది. అందులో నాగుపాము కూడా ఉంది. అయినా ఆ మహిళ భయపడకుండా ఆ పామును దైవంగా భావించింది. నాగదేవత తనకు రక్షణగా ఉంటుంది కానీ హాని చెయ్యదని అనుకుంది. ప్రతిరోజూ పుట్ట శుద్ది చేసి పూజలు చేస్తుంది.

హిందూ సంప్రదాయంలో పామును నాగదేవతగా కొలుస్తారు. నాగపంచమి, నాగుల చవితికి పుట్టలో పాలుపోసి, పూజలు చేస్తారు. అలా తన ఇంట్లోకి వచ్చిన పామును దైవంగా భావించి నిత్యం పూజలు చేసింది. చివరకు అదే పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ. ఈ ఘటన నిర్మల్‌ జిల్లాలో జరిగింది. స్థానికులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..ఖానాపూర్ మండలం గోసంపల్లె గ్రామానికి చెందిన అలుగుల గంగవ్వ అనే 65 ఏళ్ల మహిళ అంగన్‌వాడీ లో ఆయాగా విధులు నిర్వహించి ఇటీవలే పదవి విరమణ పొందింది‌. ఆమె నివాసం ఉండే ఇంట్లో పాము పుట్ట ఉంది. అందులో నాగుపాము కూడా ఉంది. అయినా ఆ మహిళ భయపడకుండా ఆ పామును దైవంగా భావించింది. నాగదేవత తనకు రక్షణగా ఉంటుంది కానీ హాని చెయ్యదని అనుకుంది. ప్రతిరోజూ పుట్ట శుద్ది చేసి పూజలు చేస్తుంది. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం లేవగానే ఇంటి పనుల్లో భాగంగా మట్టి నేలను అలుకుతుండగా అకస్మాత్తుగా పుట్టలో నుంచి బయటకు వచ్చిన నాగుపాము ఆమె చేతిపై పలుమార్లు కాటు వేసింది. అయినా తనకు ఏమీ కాదనుకుంది. కాసేపటికి ఆమెకు అస్వస్థత కలగడంతో గంగవ్వ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే గంగవ్వను నాటు వైద్యం కోసం లింగాపూర్ కు తరలించగా… పరిస్థితి విషమించిందని వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో హుటాహుటిన ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో గంగవ్వ మృతి చెందింది. నమ్మి మొక్కిన పామే ప్రాణం తీసిందని.. సకాలంలో‌ గంగవ్వ కుటుంబ సభ్యులకు స్థానికులకు సమాచారం ఇవ్వకపోవడం.. నాటు వైద్యం కోసం తరలించడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on