Woman Train Accident: రైలు కింద ప‌డిన మ‌హిళ‌.. కాపాడేందుకు ట్రైన్ రివ‌ర్స్‌.!

|

Jul 11, 2024 | 5:34 PM

ఓ మ‌హిళ రైలు కింద ప‌డి ప్రాణాల‌తో బ‌య‌డ‌ప‌టింది. రైలు కింద మ‌హిళ చిక్కుకున్న విష‌యాన్ని గ్రహించిన లోకో పైల‌ట్ ట్రైన్‌ను వెన‌క్కి వెళ్లనివ్వడంతో ఆమెకు ప్రాణాపాయం త‌ప్పింది, అయితే ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని ముంబై లోక‌ల్ స్టేష‌న్‌లో సోమ‌వారం చోటుచేసుకుంది. ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మ‌హిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది.

ఓ మ‌హిళ రైలు కింద ప‌డి ప్రాణాల‌తో బ‌య‌డ‌ప‌టింది. రైలు కింద మ‌హిళ చిక్కుకున్న విష‌యాన్ని గ్రహించిన లోకో పైల‌ట్ ట్రైన్‌ను వెన‌క్కి వెళ్లనివ్వడంతో ఆమెకు ప్రాణాపాయం త‌ప్పింది, అయితే ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లను కోల్పోయింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని ముంబై లోక‌ల్ స్టేష‌న్‌లో సోమ‌వారం చోటుచేసుకుంది. ముంబైలోని బేలాపూర్ స్టేషన్ నుంచి థానేకు వెళ్లేందుకు ఓ మ‌హిళ లోకల్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే.. ఆ రైలు రద్దీగా ఉండటంతో ఆమె ఎక్కే క్రమంలో కాలు జారింది. దీంతో.. రైలు కింద పడిపోయింది. అప్పటికే రైలు కదలడంతో.. ఒక బోగీ ఆమె పై నుంచి వెళ్లింది. అప్పుడు ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బంది అలారం మోగించడంతో.. రైలు వెనక్కు వెళ్లింది.

రైల్వే పోలీసులు ట్రాక్‌లపై దిగి.. ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంట‌నే మ‌హిళ‌ను సమీపంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన‌ట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నిల తెలిపారు. ఈ ఘటనలో మహిళ తన రెండు కాళ్లను కోల్పోయింది. ముంబైలో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో న‌గ‌రంలో ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు రద్దు కావ‌డంతో స్టేష‌న్‌ల‌లో ప్రయాణికుల ర‌ద్దీ పెరింది. ఫుట్‌బోర్డు వద్ద నిలబడి మ‌రీ ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే బేలాపూర్ స్టేషన్‌లో చాలాసేపు తర్వాత థానేకి వెళ్లే రైలు రావడంతో.. జనాలు ఎగబడ్డారు. దీంతో బాధిత మహిళ కాలుజారి కిందపడినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.