Mumbai Hit and Run: మహిళపై కారును పోనిచ్చి.. గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో దాక్కుని.. యువకుడిపై లుక్‌ఔట్‌.

Mumbai Hit and Run: మహిళపై కారును పోనిచ్చి.. గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో దాక్కుని.. యువకుడిపై లుక్‌ఔట్‌.

Anil kumar poka

|

Updated on: Jul 11, 2024 | 5:09 PM

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, శివసేన యువనేత మిహిర్‌ షా కోసం గాలిస్తున్నారు. ఘటన తర్వాత నిందితుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు.

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శివసేన నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, శివసేన యువనేత మిహిర్‌ షా కోసం గాలిస్తున్నారు. ఘటన తర్వాత నిందితుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబయిలోని వర్లీ ప్రాంతంలో మిహిర్‌ మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో 45 ఏళ్ల కావేరి నక్వా అక్కడికక్కడే మరణించగా.. ఆమె భర్త గాయపడ్డారు. అయితే, ప్రమాదం తర్వాత మిహిర్‌ ఘటనకు కొద్ది దూరంలో తన కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేరుగా తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడ కొంతసేపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడు పరారైనట్లు నిర్థారించారు. నిందితుడి గర్ల్‌ఫ్రెండ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మిహిర్‌ దేశం విడిచి వెళ్లిపోయే అవకాశముందని అనుమానించిన పోలీసులు అతడిపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. నిందితుడి కోసం ఆరు బృందాలు గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్‌ జుహూ ప్రాంతంలోని ఓ బార్‌లో మద్యం తాగినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్‌లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో మిహిర్‌తో పాటు అతడి డ్రైవర్‌ కూడా ఉన్నాడు. బార్‌ నుంచి ఇంటికి వెళ్తూ కారు తానే నడుపుతానని పట్టుబట్టి నిందితుడు డ్రైవర్‌ సీట్లోకి మారినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మిహిర్‌ తండ్రి రాజేశ్‌ షా, డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.