Woman Viral Video: రోటీ చేస్తూ పాట అదరగొట్టిన మహిళ.. ఫ్రొఫెషనల్స్‌కు ఏ మాత్రం తగ్గలేదుగా.. వీడియో.
పనీ-పాట.. రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఆడుతూ పాడుతూ పనిచేస్తే మనిషికి అలసట తెలియదు. అందుకే పొలాల్లో నాట్లు వేసేటప్పడు మహిళలు పాటలు పాడుతూ పనిచేసేవారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ.. రోటీలు చేస్తూ ఓ పాటను హమ్ చేస్తోంది. కొంత సమయం తర్వాత సైలెంట్ అయిపోయింది. అప్పుడు ఆమె దగ్గరే ఉన్న ఆమె కూతరు..‘మమ్మీ.. నాకోసం పాట పాడవా..’ అంటుంది. అందుకు ఆమె నిరాకరించడంతో… నీ వాయిస్ నాకు చాలా బాగుంటుంది.. నువ్వు పాట పాడి చాలా రోజులు అయ్యింది. ఇప్పుడు పాడాల్సిందే అని పట్టుబట్టడంతో ఆమె కాదనలేకపోయింది. ‘మేరే నైనా సావన్ భాదో’ అని హమ్ చేయడం స్టార్ట్ చేసి, అద్భుతంగా పాడింది. ఆమె గాత్రం ఎంతో శ్రావ్యంగా ఉంది. ఆ వాయిస్ విన్న వాళ్లు ఎవరైనా సరే.. ఆమె నోట నుంచి వచ్చే పాటను మళ్లీ మళ్లీ వినడానికి ఇష్టపడతారనడంలో సందేహం లేదు. ఈ అద్భుతమైన వీడియోను ఐఏఎస్ అధికారి.. అవ్నీష్ శరణ్ తన ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీనికి ‘అద్భుతం’ అనే క్యాప్షన్‌లో రాశారు. ఈ వీడియోను ఇప్పటికే 7 లక్షల 59 వేల మందికి పైగా వీక్షించగా, 4 వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాదు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..