Viral Video: రోడ్లు అధ్వానంపై బురదలో కూర్చొని మహిళ నిరసన.. వీడియో.

|

May 27, 2024 | 12:45 PM

హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే రహదారుల దుస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చినుకు పడితే ట్రాఫిక్‌ పద్మ వ్యూహం. వాన తగ్గినా నగరవాసుల గుండెల్లో అలజడినే. ఇక్కడా అక్కడా అనే తేడాలేదు. ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం. వెళ్లొస్తామని చెప్పి బయలుదేరినా, మళ్లీ ఇంటికి చేరుతారా? లేదా? అనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే అడగడుగునా ప్రాణ గండమే. దీంతో హైదరాబాద్ నాగోల్‌లోని రోడ్లు పాడైపోయిన ఎవరూ పట్టించుకోవట్లేదని..

హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే రహదారుల దుస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చినుకు పడితే ట్రాఫిక్‌ పద్మ వ్యూహం. వాన తగ్గినా నగరవాసుల గుండెల్లో అలజడినే. ఇక్కడా అక్కడా అనే తేడాలేదు. ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం. వెళ్లొస్తామని చెప్పి బయలుదేరినా, మళ్లీ ఇంటికి చేరుతారా? లేదా? అనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే అడగడుగునా ప్రాణ గండమే. దీంతో హైదరాబాద్ నాగోల్‌లోని రోడ్లు పాడైపోయిన ఎవరూ పట్టించుకోవట్లేదని ఓ మహిళ రోడ్డుపై వినూత్న నిరసనకు దిగింది. నగరవాసుల ఆవేదనను కళ్లకు కడుతూ ఓ మహిళ నాగోల్ బండ్లగూడ నడిరోడ్డుపై నీటి మడుగులో కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేసింది. కంకర తేలడమే కాదు ఏకంగా గుంతలు పడి నీళ్లు నిలిచిపోయాయి. పిల్లలో పెద్దలో అటుగా వెళ్తే.. అక్కడేదైనా మ్యాన్‌ హోల్‌ ఉంటే పరిస్థితి ఏంటి? జరగకూడినిదీ జరిగితే అందుకు బాధ్యులెవరు?. వర్షం తెరిపిచ్చినా బల్దియా కళ్లు మాత్రం తెరుచుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బురదలో కూర్చుని మరి నిరసన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు నచ్చచెప్పినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రోడ్‌ సేఫ్టీపై జీహెచ్‌ఎంసీ అధికారులు నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు అక్కడ నుంచి ఆమె కదల్లేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on