అదృష్టవంతులు.. చికెన్ శాండ్‌విచ్ ప్యాకెట్‌లో కరెన్సీ నోట్ల కట్టలు !!
టెక్నాలజీ పెరిగిపోయింది.. సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఫుడ్ యాప్‌లు వచ్చాక కొంత మంది వంటలు చేయడమే మానేశారు. ఏది తినాలనిపించినా..
టెక్నాలజీ పెరిగిపోయింది.. సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఫుడ్ యాప్‌లు వచ్చాక కొంత మంది వంటలు చేయడమే మానేశారు. ఏది తినాలనిపించినా.. క్షణాల్లో ఆన్‌లైన్ లో ఆర్డర్ పెట్టుకొని ఏం చక్కా తినేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆ ఫుడ్‌ను డెలివరీ అయ్యింది. అయితే ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన మహిళ అవాక్కైంది. అందులో వచ్చింది ఫుడ్ కాదు.. కరెన్సీ నోట్ల కట్టలు. ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో వెలుగులోకి వచ్చింది. KFC ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి ఒక మహిళ చికెన్ శాండ్‌విచ్‌ను ఆర్డర్ చేసింది. మహిళ ఫుడ్ ప్యాకెట్ అందుకుని ఓపెన్ చేయడంతో.. అందులో 500 డాలర్లు అంటే మొత్తం 43 వేల రూపాయలు బయటపడ్డాయి. వెంటనే ఆ మహిళ తన నిజాయితీని ప్రదర్శించి.. కంపెనీని అధికారులకు ఫోన్ చేసింది.. దీంతో ఉద్యోగులు పరుగు .. పరుగున అక్కడికి చేరుకుని.. ఆ డబ్బులున్న ఫుడ్ ప్యాకెట్‌ను కలెక్ట్ చేసుకున్నారు. ఇదిలావుంటే, ఆ రోజు వచ్చిన కలెక్షన్ మొత్తం ఓ బాక్స్‌లో పెట్టి.. పక్కన పెట్టాడు మేనేజర్. అయితే ఆ ప్యాకెట్.. మహిళ ఆర్డర్ చేసిన ఫుడ్ ప్యాకెట్ ప్యాక్ ఒకేలా ఉండటంతో.. డెలివరీ బాయ్ పొరపాటుతో ఆ మహిళ వద్దకు చేరింది. తన ఉద్యోగం కాపాడిన మహిళకు కృతజ్ఞతలు తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కార్లు క్లీన్ చేసుకునేవ్యక్తిని వరించిన అదృష్టం.. ఒక్కరోజులో కోటీశ్వరుడయ్యాడు
విమాన సిబ్బందిపై ప్యాసింజర్ దాష్టీకం !!
పొడవైన చెట్టుపైకి ఎక్కిన వ్యక్తి.. పైకి వెళ్లాక అక్కడి సీన్ చూసి గుండె గుబేల్..
అరే ఏంట్రా ఇది.. సింగిల్స్ వంటింటి కష్టాలు.. చూస్తే నవ్వాపుకోలేరు
TOP 9 ET News: రాకీభాయ్ గురిపెడితే బుల్లెట్ దిగాల్సిందే || 3డీలో శాకుంతలం