సాధారణంగా విమానాలు సమయపాలన కచ్చితంగా పాటిస్తాయి. ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ ఇవ్వడం, వారిని ఫ్లైట్ లోకి ఎక్కించడం వంటివి నిర్ణీత సమయానికి జరిగిపోతుంటాయి. ఆలస్యంగా వచ్చిన ప్రయాణికుల పట్ల విమాన సిబ్బంది కొందరు కఠినంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాగే జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లేట్ గా వచ్చినందుకు విమానంలోకి అనుమతించలేదని ఓ మహిళ తీవ్ర ఆవేదన చెందింది. బాధతో నేలపై పడి విలపించింది. దిల్లీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. సదరు మహిళకు డయాబెటిక్, గుండె సమస్యలు ఉన్నాయని, దీంతో తాము ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తామని సిబ్బందికి ముందే సమాచారం అందించామని బాధితురాలి బంధువులు పేర్కొన్నారు. ఈ సమయంలో సిబ్బంది వైద్యసాయం చేయకుండా సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి తమను ఎగ్జిట్ గేటు వద్ద వదిలి రమ్మని ఆదేశించినట్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ట్విటర్ వేదికగా స్పందించింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సర్క్యూలేట్ అవుతున్న ఆ వీడియో తమ ఇమేజ్‌ను తప్పుదోవ పట్టించేదిగా ఉందని తెలిపింది. వాస్తవాలు తెలుసుకోకుండా, తమ వివరణ కోరకుండా కొందరు ఈ వీడియోను పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
#FlyAI : Air India statement on Delhi Airport Video . pic.twitter.com/mHgUkWk13p
— Air India (@airindiain) May 11, 2022
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి