రన్నింగ్‌ ట్రైన్‌లో వంటలు చేసిన మహిళ.. ఇండియన్‌ రైల్వే ఏం చేసిందంటే

Updated on: Nov 26, 2025 | 1:01 PM

రైలులో ఎలక్ట్రిక్ కెటిల్‌తో మ్యాగీ వండిన మహిళ వీడియో వైరల్‌గా మారింది. మొబైల్ ఛార్జింగ్ సాకెట్ ఉపయోగించి ఆమె వంట చేసింది. ఈ ఘటన రైల్వే అధికారుల దృష్టికి వెళ్లడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అధిక శక్తి వినియోగం వల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ అప్రమత్తమై రైళ్లలో ఎలక్ట్రిక్ కెటిల్‌ల వాడకంపై నిషేధాన్ని ప్రకటించింది. సదరు మహిళపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

సాధారణంగా రైళ్లలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు అవసరమైన ఆహారం ఇంట్లోనే తయారుచేసుకొని వెంట తీసుకెళ్తుంటారు. ఇక కాఫీ, టీలు తాగేవారు ట్రైన్‌లో కొనుక్కొని తాగుతారు. కానీ ఓ మహిళ ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ట్రైన్లో వంట చేసింది. పైగా వీడియో తీసి దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అది కాస్తా రైల్వే అధికారులకు చేరడంతో ఆమెకు ఊహించని షాకిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ మహిళ రెండు నిమిషాల్లో రెడీ అయ్యే మ్యాగీని ట్రైన్‌లో వండింది. ఆమె తన వెంట తెచ్చుకున్న ఎలక్ట్రిక్‌ కెటిల్‌లో మ్యాగీ ప్రిపేర్‌ చేసింది. మొబైల్‌ ఛార్జింగ్‌ కోసం ట్రైన్‌లో ఉండే సాకెట్‌లో ఎలక్ట్రిక్‌ కెటిల్‌ ప్లెగ్‌ చేసి మ్యాగీ తయారు చేసింది. అక్కడితో ఆగకుండా.. ట్రైన్‌లో వీడియో తీస్తూ వంటల ప్రొగ్రామ్‌ పెట్టేసింది. ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ వీడియోలో మహిళ మరాఠీలో మాట్లాడుతూ.. కెటిల్ లోపల మ్యాగీ ఉడికిస్తున్నట్టు, దాని పక్కన ఒక కప్పు టీ కూడా ఉంచి చూపించింది. తన పక్కన ఉన్న సహ ప్రయాణీకుడికి ఈ రెడీమేడ్ అల్పాహారం అందించానని ఆమె పేర్కొంది. పైగా తనకు ట్రైన్‌లో కూడా రెస్ట్‌ దొరకదని, తన కిచెన్‌ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుందంటూ సరదాగా అంది. కానీ ఆమె అక్కడితో ఆగలేదు కెటిల్‌లో మ్యాగీ మాత్రమే కాదు గతంలో అదే కెటిల్‌లో దాదాపు 15 మంది ప్రయాణికులకు టీ తయారు చేసినట్లు కూడా తెలిపింది. ఈ వీడియో కాస్త రైల్వే అధికారుల కంట్లో పడింది. వెంటనే ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఆ మహిళ వీడియో త్వరగా వైరల్ కావడంతో ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రైలు పవర్ సాకెట్లు తక్కువ శక్తి గల పరికరాల కోసం ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ కెటిల్‌ల వంటి అధిక శక్తి గల ఉపకరణాల కోసం కాదని చాలా మంది నెటిజన్లు ఆ‍గ్రహం వ్యక్తం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ అయి ఏదైన ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అంటూ మండిపడ్డారు. వైరల్ వీడియోకు ప్రతిస్పందిస్తూ సెంట్రల్ రైల్వేస్ రైళ్లలో ఎలక్ట్రిక్ కెటిల్‌లను ఉపయోగించడం నిషేధమని, కెటిల్‌లో మ్యాగీ ప్రిపేర్‌ చేసిన మహిళపై చర్యలు తీసుకుంటామని కూడా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎస్బీఐ పేరుతో వాట్సాప్‌లో కొత్త మోసం.. వేలాది ఎకౌంట్లు ఖాళీ

పంది చిన్నగానే ఉందిగా అని తీసి పడేయకండి.. చిరుతకే సుస్సు పోయించింది

అమావాస్య వేళ రంగు మారిన నీరు.. కారణం అదేనట

లైంగిక సామర్థ్యం పెంచుతానని లక్షలు ఖర్చు చేయించి.. చివరికి అనుకున్నది చేసాడు