AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలిలో మార్నింగ్‌ వాక్‌ మంచిదేనా? వీడియో

చలిలో మార్నింగ్‌ వాక్‌ మంచిదేనా? వీడియో

Samatha J
|

Updated on: Nov 23, 2025 | 2:25 PM

Share

ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకే చాలా మంది ఫిట్ గా ఉండటంపై దృష్టి సారిస్తారు.. ముఖ్యంగా మార్నింగ్ వాక్ చేస్తారు.. నడక అనేది ఒక సులభమైన, సహజమైన, ఖర్చులేని వ్యాయామం.. ఇది అనేక శారీరక – మానసిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నడక అనేది ఎక్కువ శ్రమ లేదా సమయం అవసరం లేని శారీరక శ్రమ. ఉదయం దీన్ని చేయడానికి ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. కానీ ప్రశ్న ఏమిటంటే, శీతాకాలంలో తెల్లవారుజామున చల్లని గాలులలో నడవడం ఎంతవరకు సరైనది? ఏమైనా సమస్యలు ఎదురవుతాయా..? అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరంలో రక్తప్రసరణ సాధారణం కంటే కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కొన్నిసార్లు హాని కలిగించే ప్రమాదం ఉంది. నిజానికి, నడక శరీరంలో శక్తిని పెంచుతుంది. ఇది గుండె – ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా బలపరుస్తుంది. ఇంకా ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాలను బలపరుస్తుంది – మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

క్రమం తప్పకుండా నడవకపోతే లేదా ఏదైనా శారీరక శ్రమలో పాల్గొనకపోతే, అది శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. బరువు పెరగడం, ఊబకాయం, రక్తంలో చక్కెర సమస్యలు పెరుగుతాయి. గుండె – ఊపిరితిత్తుల పనితీరు బలహీనపడుతుంది. గుండెపోటు – స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కండరాల బలహీనత, కీళ్ల నొప్పులు, అలసట సాధారణం.. శారీరక శ్రమ ఒత్తిడి, నిరాశను తగ్గిస్తుంది. కాబట్టి మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. దీర్ఘకాలిక నిశ్చల జీవనశైలి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.. శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.నిపుణుల ప్రకారం.. ఉదయం చల్లటి గాలిలో నడవడం సాధారణంగా మంచిదని చెబుతారు. చల్లని గాలిలో నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది. అయితే, ఎవరైనా ఉబ్బసం, రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడుతుంటే, వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరు ఉదయం లేదా మధ్యాహ్నం నడక చేయాలి. తద్వారా శరీరం పూర్తిగా చురుకుగా ఉంటుంది. జలుబు ప్రభావాలను తగ్గించవచ్చు.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో