డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకే షాకిచ్చిన మందుబాబు..ఏం చేశాడంటే వీడియో
పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ యువకుడిని ఆపి చెక్ చేశారు పోలీసులు. మద్యం సేవించినట్లు తేలడంతో ఆ యువకుడి బైక్‌ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాంతో మందుబాబు పోలీసులకే షాకిస్తూ సీఐ వాహనాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
ఆలూరు మండలం పెద్దహో తురు గ్రామానికీ చెందిన యువరాజు అనే యువకుడు మద్యం సేవించి తన బైక్ పై నడుపుతూ ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆలూరు శివారులో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు పడ్డాడు. పోలీసులు యువరాజు బైక్ ను పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీసులు తన బండి ఎప్పుడు ఇస్తారా అని చూస్తూ ఉన్న యువరాజుకి ఓ ఐడియా వచ్చింది. నా దారిన నేను ఇంటికి పోతుంటే నన్ను ఆపుతారా.. ఇప్పుడు చెప్తా మీపని.. అన్నట్టుగా యువరాజు అక్కడే ఉన్న సీఐ వాహనాన్ని తీసుకొని పారిపోయాడు. గమనించిన పోలీసులు యువరాజు వెంట పడడంతో వాహనాన్ని మధ్యలోనే వదిలేసి పరారు అయ్యాడు. యువరాజు కోసం పోలీసులు గాలించారు. అయినా అతని జాడ తెలియకపోవడంతో..పోలీసులు యువరాజు తల్లిదండ్రులను, తమ్ముడిని పోలీసు స్టేషన్ కు తరలించారు. యువరాజు మద్యం మత్తులో చేసిన పొరపాటుకి వారి కుటుంబ సభ్యులను స్టేషన్‌కి తీసుకురావడంతో వారు లబోదిబోమంటున్నారు. మరోవైపు యువరాజు చేసిన పనిని సమర్థిస్తున్నారు కొందరు మందుబాబులు. పోలీసులకు వ్యతిరేఖంగా యువరాజు ఇలా చేయడం తప్పు అంటున్నారు ఇంకొందరు.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
