ఈమె ట్రెండ్ ఫాలో అవ్వదు..సెట్ చేస్తుంది..వీడియో
సాధారణంగా వివాహ సమయంలో వధూవరులు మండపానికి చేరుకోడానికి కారులోనో, గుర్రంపైనో ఊరేగింపుగా చేరుకుంటారు. ఇక పెళ్లి కుమార్తె వెంట నలుగురైదుగురు ముత్తయిదువలు తోడురాగా పెళ్లి వేదికకు చేరుకోవడం సంప్రదాయం. అలా కాకుండా వధువు పెళ్లికూతురు గెటప్‌లో స్పోర్ట్స్ బైక్‌పైన పండపానికి వస్తే.. అదికూడా తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది.. ఇదిగో ఇలా ఉంటుంది. ఓ వధువు స్పోర్ట్స్ బైక్‌పై దూసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు.. ఆహా.. ఈమె ట్రెండ్ ఫాలోవర్ కాదు.. ట్రెండ్ సెట్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి ఎర్రని లెహెంగా, తలపైన ఓణీ ధరంచి పూర్తిగా పెళ్లికూతురు గెటప్‌లో ముస్తాబైంది. నేరుగా స్పోర్ట్స్ బైక్ వేసుకొని రయ్..య్..మంటూ దూసుకెళ్తోంది. పెళ్లి బట్టల్లో ఒంటరిగా యువతి అదికూడా స్పోర్ట్స్ బైక్‌ను ఎంతో కాన్ఫిడెంట్‌గా నడుపుతూ వెళ్తుంటే.. రోడ్డుమీద వెళ్తున్న ఇతర వాహనదారులు ఆశ్చర్యంగా యువతిని చూశారు. కొందరు తమ మొబైల్స్‌లో నవ వధువు బైక్ రైడ్‌ను రికార్డు చేశారు. ఈ వీడియోలో వధువు నిజంగా పెళ్లిమండపానికి వెళ్తుందో.. లేక రీల్స్ కోసం ఇలా చేశారో తెలియలేదు కానీ… ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటికే వీడియోను 3 మిలియన్లమందికి పైగా చూశారు. 80 వేలమందికి పైగా లైక్ చేస్తూ కామెంట్లు చేశారు. అద్భుతం.. ఈమె పెళ్లిరోజు కూడా తన రైడ్ ఆపలేదంటే.. వధువులు ఇకపై సంప్రదాయాలకే పరిమితం కాదు.. వారు తమ గుర్తింపు, అభిరుచికి తగినట్టుగా బహిరంగంగా జీవిస్తున్నారు అంటూ కామెంట్లు పెట్టారు.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
