చైనా సంచలనం.. కదిలే దీవికి శ్రీకారం..వీడియో
డ్రాగన్ కంట్రీ ఎప్పులూ ఏదొక ప్రయోగం చేస్తూ సంచలనం సృష్టిస్తుంటుంది. ప్రమాదకర వైరస్‌ల నుంచి అణుబాబుల వరకూ ఏదైనా చైనాకే సాధ్యం. తాజాగా మరో సంచలనాత్మక ప్రాజెక్టుకు చైనా శ్రీకారం చుట్టింది. ఏకంగా 78,000 టన్నుల బరువున్న ఒక కృత్రిమ దీవిని నిర్మిస్తోంది. ఇది సముద్రంలో కదులుతూ ఉండటం దీని ప్రత్యేకత. అంతేకాదు అణు దాడులను సైతం తట్టుకోగలదు. ఈ దీవిని శాస్త్రీయ పరిశోధనల కోసం నిర్మిస్తున్నామని చైనా చెబుతోంది. అయితే, దీని నిర్మాణం సైనిక ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చైనాకు చెందిన ఫుజియాన్ విమాన వాహక నౌక అంత పరిమాణంలో ఉండే ఈ ప్లాట్‌ఫామ్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలాంటి బయటి సరఫరాలు అవసరం లేకుండా 238 మంది సిబ్బంది నాలుగు నెలల పాటు ఇక్కడ నివసించేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని, 2028 నాటికి దీని కార్యకలాపాలు ప్రారంభించేలా చూడటమే తమ లక్ష్యమని తెలిపారు.ఇక, ఈ కృత్రిమ దీవి అత్యంత కఠినమైన సముద్ర వాతావరణాన్ని కూడా తట్టుకునేలా నిర్మిస్తున్నారు. 6 నుంచి 9 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అలలను, అత్యంత శక్తిమంతమైన కేటగిరీ 17 తుఫానులను కూడా ఇది ఎదుర్కోగలదు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. తీవ్రమైన అఘాతాలను సైతం తేలికపాటి ఒత్తిళ్లుగా మార్చేసే “మెటామెటీరియల్” శాండ్‌విచ్ ప్యానెళ్లను ఇందులో వినియోగిస్తున్నారు. అధికారికంగా దీనిని “డీప్-సీ ఆల్-వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీ” అని పిలుస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
