ఏం కొనలేం..తినలేం.. బాబోయ్ వీడియో
కూరగాయల ధరలు సామాన్యులను హడలెత్తిస్తున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ధరలతో ఏం కొనాలి..ఏం తినాలి అంటున్నారు వినియోగదారులు. నవంబరులో సాధారణంగా కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి మారింది. కొద్దిరోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. మొంథా తుపాన్‌తో కూరగాయల పంటకు భారీగా నష్టం వాటిల్లింది. దిగుబడి సైతం బాగా తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు పెరిగాయి. ఏ కూరగాయ చూసినా కిలో రూ.80 నుంచి 100 లు పలుకుతోంది. దీంతో పేద,మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తుపాను ముందు టమాటా కేజీ రూ.20 నుంచి రూ.40 రూపాయలు ఉండేది. ఇప్పుడు రూ. 50 నుంచి 60 ధర పలుకుతున్నది. టమాటా లేనిదే ఏ వంట చేసుకోని పరిస్థితి. దీంతో తప్పనిసరిగా కిలో కొనేవారు అరకిలో కొని సరిపెట్టుకుంటున్నారు. ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. బెండకాయ-రూ.80, పచ్చిమిర్చి-రూ.100, బీరకాయ-రూ.80, క్యారెట్ రూ.100, బీట్‌రూట్ రూ.100, వంకాయ రూ.110, గోబీ రూ. 80 ధర పలుకుతున్నాయి. పాలకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలు సైతం కిలో రూ.40 నుంచి 50 పలుకుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరతో ఏం కొనేటట్టు లేదు…ఏం తినేటట్టు లేదు అంటూ బాధపడాల్సిన రోజులొచ్చాయని ప్రజలు వాపోతున్నారు. పెరిగిన రేట్లతో రూ.500లు పెట్టినా మూడు రోజులకు సరిపోయే కూరగాయలు రావడం లేదు. పలు జిల్లాల్లో వర్షాలతో కూరగాయల పంటలు దెబ్బతిని, దిగుబడి తగ్గింది. సాగు సైతం కొద్దిరోజులుగా తగ్గింది. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి ప్రధాన పట్టణాలకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. యాసంగి పంట చేతికి వస్తే మరో మూడు వారాల్లో కొంత వరకు ధరలు దిగివస్తాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
