Viral Video: మొసలితో అడవి దున్న హోరాహోరీ పోరు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

అడవిలోని ఓ సరస్సు వద్దకు నీరు తాగేందుకు ఆఫ్రికన్ రెయిన్ డీర్ వచ్చినట్లు వీడియోలో చూడొచ్చు. అడవి దున్న సరస్సు లోపలికి చేరుకోగానే లోపల ఉన్న మొసలి ఒక్కసారిగా దాడి చేస్తుంది.

Viral Video: మొసలితో అడవి దున్న హోరాహోరీ పోరు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Viral Video

Updated on: Mar 12, 2022 | 8:51 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరలవుతుంటాయి. ఇందులో ఎక్కువ భాగం జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా వీటిలో ఓ వీడియో వచ్చి చేరింది. నదిని దాటుతున్న అడవి దున్న‌పై మొసలి దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది(Viral). ఈ వీడియోలో అడవి దున్న(Wildebeest) ధైర్యం కోల్పోకుండా మొసలితో పోరాడింది. దీనిని చూసిన నెటిజన్లంతా అడవి దున్న సాహసాన్ని తెగ మొచ్చుకుంటున్నారు. అయితే, మొసలికి తన ఎరపై దాడి చేసి సజీవంగానే అమాంతం మింగగలిగే శక్తి ఉంది. మొసలి తన బలమైన దవడలతో ఎరను గట్టిగా పట్టుకుని తినే వరకు వదలకుండా పోరాడుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు శక్తివంతమైన జంతువులపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు విజయవంతం అయినా, కొన్నిసార్లు మాత్రం విఫలమవుతాయి.

ఇక ఈ వీడియో విషయానికి వస్తే.. అడవిలోని ఓ సరస్సు వద్దకు నీరు తాగేందుకు ఆఫ్రికన్ రెయిన్ డీర్ వచ్చినట్లు వీడియోలో చూడొచ్చు. అడవి దున్న సరస్సు లోపలికి చేరుకోగానే లోపల ఉన్న మొసలి ఒక్కసారిగా దాడి చేస్తుంది.

ఆకస్మిక దాడి కారణంగా, అడవి దున్న కోలుకునే అవకాశం లేదు. కానీ, తన ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మొసలిని నీటి నుంచి బయటకు తీసుకరావడానికి తన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రైయిన్‌డీర్ తప్పించుకుంటుంది. కానీ, మరలా మొసలి తిరిగి దాడి చేస్తుంది. అడవి దున్న తోకను గట్టిగా పట్టుకుని, దానిని తిరిగి నీటిలోకి లాగడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది.

గాయపడిన రైన్డీర్ కూడా తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన శక్తి మేరకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ దాడిలో రైనీర్డ్ వెన్ను తీవ్రంగా గాయపడినా.. మొత్తానికి మొసళ్ల నుంచి ప్రాణాలు కాపాడుకోవడంలో మాత్రం విజయం సాధించింది. ఈ షాకింగ్ వీడియో @iftirass అనే ట్విట్టర్ ఖాతాతో షేర్ చేశారు.

Also Read: Viral Video: ఇరగదిద్దామనుకున్నాడు.. కాళ్లు విరగొట్టుకున్నాడు.. వైరల్ అయిన వీడియో..

Watch Video: ఎమ్మెల్యేను పొట్టు పొట్టుగా కొట్టిన జనాలు.. సంచలనంగా మారిన వీడియో..