Crime: భార్యను ‘టార్చర్‌ రూమ్‌’లో బంధించి.. 12 ఏళ్ల పాటు హింసించిన భర్త.

|

Aug 15, 2023 | 9:43 AM

జర్మనీలో ఒ వ్యక్తి తన భార్యను 12 ఏళ్ల పాటు గదిలో బందీ చేసి ఆమెను టార్చర్‌ పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని ఇంటికి చేరుకోగా బాధితురాలు అర్థనగ్నంగా శిరోముండనంతో పోలీసులకు కనిపించింది. ఆ మహిళ భర్త చేతిలో అత్యంత దయనీయమైన పరిస్థితులను చవిచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 53 ఏళ్ల నిందితుడిని పోలీసులు ఫోర్‌బ్యాక్‌ పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు.

జర్మనీలో ఒ వ్యక్తి తన భార్యను 12 ఏళ్ల పాటు గదిలో బందీ చేసి ఆమెను టార్చర్‌ పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని ఇంటికి చేరుకోగా బాధితురాలు అర్థనగ్నంగా శిరోముండనంతో పోలీసులకు కనిపించింది. ఆ మహిళ భర్త చేతిలో అత్యంత దయనీయమైన పరిస్థితులను చవిచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 53 ఏళ్ల నిందితుడిని పోలీసులు ఫోర్‌బ్యాక్‌ పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. 2011లో భర్త ఆమెను కిడ్నాప్‌ చేశాడని బాధితురాలు పోలీసులకు తెలినింది. ఇటీవల ఆమెకు ఫోను అందుబాటులోకి రావడంతో ఆమె పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఒక గదిలో బంధీగా పోలీసులకు కనిపించింది.

భర్త ఆమెను ఇనుప తీగలతో కట్టేశాడు. ఆ గదిలోకి వెళ్లిన ముగ్గురు పోలీసులకు బాధితురాలు సెమీ న్యూడ్‌గా గుండుతో కనిపించింది. ఆమె చేతి వేళ్లు, కాలి వేళ్లు పనిచేయని స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. అలాగే ఆమెకు కొంతకాలంగా ఆహారం ఇవ్వడం లేదని కూడా తెలుసుకున్నారు. టార్చర్‌ రూమ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. ఇంటినుంచి ఒక మహిళ అరుపులు వినిపించేవని, తాము ఆ ఇంటి యజమానిని దీని గురించి అడిగినప్పుడు తన భార్యకు క్యాన్సర్‌ అని, బాధతో అలా అరుస్తుంటుందని చెప్పేవాడని ఇరుగు పొరుగు అన్నారు. అయితే తాము ఎప్పుడూ ఆ బాధిత మహిళను చూడలేదని వారు తెలిపారు. అయితే పొరుగింటికి చెందిన ఒక వ్యక్తి తాను 10 ఏళ్ల క్రితం ఆ ఇంటిలో ఒక మహిళను చూశానని, ఇన్నాళ్లుగా కనిపించకపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని, లేదా వేరే ప్రాంతానికి వెళ్లిందని అనుకున్నానని తెలిపారు. పోలీసులకు ఆ ఫ్లాట్‌లో ఒక నోట్‌ బుక్‌ లభ్యమయ్యింది. దానిలో నిందితుడు తన భార్యను టార్చర్‌ పెట్టిన విధానాలను, ఆమెకు ఆహారం ఇచ్చిన తేదీలను రాశాడని సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...