SBI Shares: 30 ఏళ్ల క్రితం షేర్లు కొన్న తాత.. ఇప్పటి విలువ చూసి మనవడు షాక్.!
పొదుపు విషయంలో మనకంటే మన పూర్వీకులే ముందు వరుసలో ఉంటారు. పెట్టుబడి సాధనాలు ఆ రోజుల్లో అందుబాటులో ఉండేవి కావు. అయినా భవిష్యత్తు తరాల కోసం ఆస్తులు కూడబెట్టేవారు. స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని 30 ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి ఎంతో ముందుచూపుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అలానే వదిలేశారు. అప్పట్లో 500 రూపాయలు పెట్టి కొన్న వాటాల నేటి విలువ చూసి ఆశ్చర్యపోవడం ఆయన మనవడి వంతైంది.
పొదుపు విషయంలో మనకంటే మన పూర్వీకులే ముందు వరుసలో ఉంటారు. పెట్టుబడి సాధనాలు ఆ రోజుల్లో అందుబాటులో ఉండేవి కావు. అయినా భవిష్యత్తు తరాల కోసం ఆస్తులు కూడబెట్టేవారు. స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా అవగాహన లేని 30 ఏళ్ల క్రితమే ఓ వ్యక్తి ఎంతో ముందుచూపుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అలానే వదిలేశారు. అప్పట్లో 500 రూపాయలు పెట్టి కొన్న వాటాల నేటి విలువ చూసి ఆశ్చర్యపోవడం ఆయన మనవడి వంతైంది. చండీగఢ్‌కు చెందిన డాక్టర్ తన్మయ్ మోతీవాలా తాత 1994లో 500 రూపాయల విలువైన ఎస్‌బీఐ షేర్లను కొనుగోలు చేశారు. ఇటీవల షేర్ల సర్టిఫికెట్‌ను కనుగొన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ షేర్లను తన తాత విక్రయించకుండా అలానే వదిలేశారని, వాటి గురించి మరిచిపోయారని పేర్కొన్నాడు. ఆ వాటాల విలువ ఇప్పుడు డివిడెండ్లు ఏవీ కలపకుండానే 3.75 లక్షల రూపాయలు అయ్యిందని తన్మయ్ తెలిపాడు.
ఇప్పుడు ఆ మొత్తం ఎక్కువ కానప్పటికీ.. 30 ఏళ్లలో 750 రెట్లు రిటర్నులు ఇవ్వడమంటే సాధారణ విషయం కాదని తన పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు. ఈ స్టాక్స్‌ను డీమ్యాట్ అకౌంట్లోకి మార్చడానికి పేరు, చిరునామాలో పొరపాట్లు ఉన్నాయని, అందుకోసమే ఓ కన్సల్టెంట్‌ను సంప్రదించానని డాక్టర్ చిన్మయ్ తెలిపాడు. ఇది కాస్త క్లిష్టమైన వ్యవహారమని, అందుకు కొంత సమయం కూడా పడుతుందనీ ఈ వాటాలను విక్రయించాలని తాను అనుకోవడం లేదనీ అన్నాడు. ఈ వైద్యుడి పోస్ట్ వైరల్‌గా మారడంతో కొందరు నెటిజన్లు స్పందించారు. ‘మన పెద్దవాళ్లను చూసి నేర్చుకోవాలి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.