వారేవా.. క్యా సీన్ హై..! అమెరికాలో పెళ్లి.. పెళ్లి వేదిక.. నెల్లూరు బాహబలి థియేటర్‌లో ..

|

May 28, 2022 | 8:52 PM

సాధారణంగా పెళ్లిళ్లు ఫంక్షన్‌ హాళ్లలోనో.. గుళ్లలోనే జరుగుతాయి. కాని నెల్లూరులో ఏకంగా సినిమా థియేటర్లోనే జరిగింది. అది కూడా 70 ఎం ఎం స్క్రీన్‌పై. ఎందుకంటే.. పెళ్లి జరిగింది అమెరికాలో కాబట్టి. నెల్లూరుకు చెందిన పలగాటి శ్రీనివాసులు రెడ్డి,


సాధారణంగా పెళ్లిళ్లు ఫంక్షన్‌ హాళ్లలోనో.. గుళ్లలోనే జరుగుతాయి. కాని నెల్లూరులో ఏకంగా సినిమా థియేటర్లోనే జరిగింది. అది కూడా 70 ఎం ఎం స్క్రీన్‌పై. ఎందుకంటే.. పెళ్లి జరిగింది అమెరికాలో కాబట్టి. నెల్లూరుకు చెందిన పలగాటి శ్రీనివాసులు రెడ్డి, సునీల దంపతుల బిడ్డ రిషితకు.. అమెరికాలో స్థిరపడిన పర్వతరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జ్యోతి దంపతుల తనయుడు రోహిత్‌రెడ్డితో వివాహం నిశ్చయించారు. అమెరికాలో పెళ్లి చేసేందుకు గ్రాండ్‌గా అరేంజ్‌మెంట్స్‌ చేశారు. ఈ నెల 21న పెళ్లి ముహూర్తం. అంటే మన టైమ్‌లో 22న మ్యారేజ్‌. అమెరికాకు వెళ్లేందుకు వీసా కోసం అప్లై చేసుకున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. కానీ వారికి వీసా మంజూరు కాలేదు. చేసేదేం లేక చివరికి కుమార్తె పెళ్లి వేడుక చూసేందుకు తిరుపతిలోని బాహుబలి థియేటర్‌ను బుక్‌ చేసుకున్నారు. బంధుమిత్రులను బాహుబలి థియేటర్‌కే ఆహ్వానించారు.బంధుమిత్రులతో కలిసి కూతురి పెళ్లిని ఎంతో వేడుకగా చేయాల్సిన తల్లిదండ్రులు..ఇలా ఏదో మూవీలో పెళ్లిని చూసినట్టు 70mm స్క్రీన్‌పైనే చూసి సంతోషపడ్డారు. అమెరికాలో కూతురి మెడలో మాంగల్యధారణ జరుగుతుంటే..స్క్రీన్‌పైనే అక్షింతలు వేసి కూతురిని, అల్లుడిని దీవించి సంతృప్తి చెందారు. కల్యాణమండపంలో అన్నీ తానై పెళ్లి తతంగంమంతా దగ్గరుండి చూడాల్సిన తండ్రి ..ఇలా స్క్రీన్‌ ముందు కూర్చుని చూడాల్సివస్తోందంటున్నారు పెళ్లికొచ్చిన అతిథులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

 

Follow us on